ఫ్రిజ్‌ లేకుండానే కూరలు భద్రం

తాజా కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పని ఒత్తిడిలో రోజూ కొనితెచ్చుకోలేం. ఫ్రిజ్‌లో ఉన్న కొద్ది స్థలంలో అన్నిటినీ దాయలేం. వీలైతే ఫ్రిజ్‌లో పెట్టొద్దని కూడా చెబుతున్నారు

Published : 12 Jul 2021 01:45 IST

తాజా కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పని ఒత్తిడిలో రోజూ కొనితెచ్చుకోలేం. ఫ్రిజ్‌లో ఉన్న కొద్ది స్థలంలో అన్నిటినీ దాయలేం. వీలైతే ఫ్రిజ్‌లో పెట్టొద్దని కూడా చెబుతున్నారు ఆహార నిపుణులు. ఈ క్రమంలో కొన్ని కూరగాయల్ని బయటే ఎలా జాగ్రత్త చేయొచ్చో చూద్దాం.

* దోసకాయలు, ఆలుగడ్డ, చిలకడదుంప, చేమదుంప, ముల్లంగి, బీట్‌రూట్‌ లాంటివి ఫ్రిజ్‌లో పెట్టక్కర్లేదు. బయటే చాలారోజులు నిలవుంటాయి.

* తడి లేని కరివేపాకును గాలి చొరని సీసాలో ఉంచితే పాడవదు.

* సీసాలో ముప్పావుభాగం వరకూ నీళ్లు నింపి క్యాబేజీని దానిమీద ఉంచితే తాజాగా ఉంటుంది. నీళ్లలో మునగకూడదండోయ్‌.

* దొండకాయలు పచ్చిగా ఉంటే ఫ్రిజ్‌ అవసరం లేదు.

* టొమాటోలు కాస్త గట్టివి తీసుకుంటే ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పండినవి వాడుకోవచ్చు.

* పాత్రలో నీళ్లు పోసి కొత్తిమీర కాడలను అందులో ఉంచితే తాజాగా ఉంటుంది.

* క్యారెట్లను అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టి, పైన, కింద తెరిచి ఉంచితే నిలవుంటాయి.

* కూరగాయలు కొనేటప్పుడు ఎండినట్లు, వాడినట్లు ఉండేవి తీసుకోకపోవడం, ఇంట్లో ఎండ తగలనిచోట కవర్లలో కాకుండా విడిగా ఉంచడం ప్రాథమిక సూత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్