దుమ్ము దులిపేస్తుంది!

పండగలప్పుడో లేదా రెండు, మూడు నెలలకోసారో ఇల్లు దులపడం, సర్దడం లాంటి పనులు చేస్తూనే ఉంటాం. అయితే పెరుగుతోన్న కాలుష్యం, మారుతోన్న ఉష్ణోగ్రతలు, వాతావరణం...

Published : 12 Jul 2021 01:45 IST

పండగలప్పుడో లేదా రెండు, మూడు నెలలకోసారో ఇల్లు దులపడం, సర్దడం లాంటి పనులు చేస్తూనే ఉంటాం. అయితే పెరుగుతోన్న కాలుష్యం, మారుతోన్న ఉష్ణోగ్రతలు, వాతావరణం... వీటివల్ల ఇంటి పరిసరాలు త్వరగా దుమ్ము, ధూళితో నిండిపోతాయి. అయితే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఒకేసారి ఎక్కువగా శ్రమకు గురికాకుండా ఉంటాం.. కిటికీలు, తలుపుల్లాంటి వాటిని శుభ్రం చేయడానికి చీపురు, బూజు కర్ర లాంటివి సరిపోవు. వీటితో పైన ఉండే దుమ్ము మాత్రమే తొలగిపోతుంది. మరి పూర్తిగా శుభ్రం చేయాలంటే వాక్యూమ్‌ క్లీనర్‌ కావాల్సిందే. అమ్మో... అంత ఖరీదైంది, పెద్దది మేం  కొనలేమంటారా... బదులుగా దీన్ని వాడి చూడండి.

తేలికగా ఉంటూ, చేతిలో ఇమిడిపోయే ఇది అచ్చం వాక్యూమ్‌ క్లీనర్‌లా పనిచేస్తుంది. కిటికీలు, అద్దాల అడుగు భాగం, గృహోపకరణాలు, కంప్యూటర్‌ కీబోర్డు, ఫర్నిచర్‌...  ఇలా అన్నింటినీ పూర్తిగా శుభ్రం చేసేస్తుంది. దుస్తులపై పడిన జుట్టు, దుమ్మునూ తొలగిస్తుంది. అలాగే తలగడలు, కారు లోపలి భాగం, ఆఫీసులో మీరు కూర్చొనే చోటు... వీటన్నింటినీ చిటికెలో శుభ్రం చేసేస్తుంది.  దీని నుంచి వెలువడే శబ్దం కూడా తక్కువే. అలాగే ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు. శుభ్రంచేయడం, భద్రపరచడమూ సులువే. ఇది ఛార్జింగ్‌తో పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్