ఇవి ఉంటే పని సులువంట!
చిన్న చిన్న పనులే వంటను ఆలస్యం చేసి ఒత్తిడిని పెంచుతాయి. దీనికి పరిష్కారంగా కొత్త పరికరాలెన్నో వస్తున్నాయి. ఇవి ఉంటే వంటింట్లో పని సులువే...
చిన్న చిన్న పనులే వంటను ఆలస్యం చేసి ఒత్తిడిని పెంచుతాయి. దీనికి పరిష్కారంగా కొత్త పరికరాలెన్నో వస్తున్నాయి. ఇవి ఉంటే వంటింట్లో పని సులువే...
డ్రెయినర్...
బియ్యం, పప్పు వంటివి కడిగి నీటిని వంపేటప్పుడు ‘డ్రెయినర్’ను అటాచ్ చేస్తే చాలు. ఒక్క గింజ కూడా పోకుండా నీటిని వంచేయొచ్చు. కాయగూరల ముక్కలను కడిగేటప్పుడు గిన్నె అంచుకు స్టెయినర్ క్లిప్‌ను తగిలిస్తే, నీటిని తేలికగా వంపొచ్చు.
వ్యర్థాల కోసం...
కూరగాయలు, ఆకు కూరలను తరుగుతున్నప్పుడు స్క్రాప్ ట్రాప్‌ను వంటింటి దిమ్మకు ఎటాచ్ చేసుకుంటే... వ్యర్థాలను ఎప్పటికప్పుడు దీంట్లోకి వేసి, తర్వాత ఒకేసారి డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు.
ఇవి ప్రత్యేకం..
చేపలపై పొలుసును తేలిగ్గా తొలగించడానికి ప్రత్యేకం ‘ఫిష్ స్కేల్ రిమూవర్’. ద్రాక్ష పండ్లను సమాన ముక్కలుగా చేయగలిగే స్లైసర్, యాపిల్ మధ్యలోని గింజలను ఒకేసారి తొలగించే కోరర్, మొక్కజొన్న గింజలను క్షణంలో వేరుచేసే కార్న్ షార్క్ వంటివీ ఉపయోగపడతాయి. ‘యాంటీ స్పిల్’ గిన్నెలోని ద్రవాలను తేలిగ్గా మరో పాత్రలోకి వంచడానికి వీలుగా ఉంటుంది.
పిల్లల కోసం
కీరదోస, క్యారెట్ వంటివి అందమైన ఆకారంలో కట్ చేయడానికి స్పైరల్ స్లైసర్ ఉపయోగ పడుతుంది. రింగురింగులుగా ఆకర్షణీయంగా కనిపించే ముక్కలను పిల్లలు నోట్లో వేసుకోకుండా ఉండలేరు. రోజూ గుడ్డు తినిపించాల్సినప్పుడు చిన్నారులకు ఈ బ్రేక్‌ఫాస్ట్ రింగ్స్‌తో రకరకాల ఆకారాల్లో చిన్నచిన్న ఆమ్లెట్స్ వేసిస్తే చాలు.... లొట్టలేసి మరీ తింటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!