వంటిల్లు ఆహ్లాదంగా!

వంటలు రుచిగా ఉంటే సరిపోదు, వంటిల్లు ఆహ్లాదం కలిగించేలా ఉండాలి.

Updated : 17 Jul 2021 01:24 IST

వంటలు రుచిగా ఉంటే సరిపోదు, వంటిల్లు ఆహ్లాదం కలిగించేలా ఉండాలి.

రాత్రి పనులన్నీ అయిపోయాక స్టవ్‌, ప్లాట్‌ఫాం శుభ్రం చేసేస్తే ఉదయం లేవగానే హాయిగా కాఫీ పెట్టేసుకోవచ్చు. కూరగాయల తొక్కు ఎప్పటిదప్పుడు బిన్‌లో పాడేస్తే... సమస్యే ఉండదు.

* పోపు వేసేటప్పుడు స్టవ్‌మీద నూనె చిందడం మామూలే. దాన్ని వెంటనే టిష్యూ పేపరుతో తుడి చేస్తే శుభ్రంగా ఉంటుంది. ప్లాట్‌ఫాం మీద నీళ్లు, పాలు, నూనె లాంటివి పడితే మైక్రోఫైబర్‌ స్పాంజితో తుడిస్తే అద్దంలా ఉంటుంది.

* సింక్‌లో ఉల్లిపొట్టు, టీపొడి లాంటివి పడకుండా ఫిల్టర్‌ వాడితే బ్లాక్‌ అవ్వదు. అప్పటికీ బ్లాక్‌ అయితే డ్రెయిన్‌ క్లీనర్‌ ఉపయోగించి నీళ్లు పోయేలా చేయాలి.

* వంటింట్లో బొద్దింకలు కనిపిస్తే దుర్భరంగా ఉంటుంది. అవి రాకుండా వైట్‌ వెనిగర్‌ కలిపిన నీళ్లను పొయ్యిగట్టు మీద, కబోర్డ్స్‌లో చిలకరించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్