మాన్‌సూన్‌లో మొక్కల రక్షణ

లాక్‌డౌన్‌ తర్వాత చాలామంది వ్యాపకం మొక్కల పెంపకమే అయ్యింది. కొత్తగా మొదలు పెట్టినవారు ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Published : 18 Jul 2021 00:42 IST

లాక్‌డౌన్‌ తర్వాత చాలామంది వ్యాపకం మొక్కల పెంపకమే అయ్యింది. కొత్తగా మొదలు పెట్టినవారు ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కుండీల కింది భాగంలో ఎక్కువైన నీరు పోయేలా రంధ్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కుండీ అడుగున ఉంచే మూతలో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.
* ఈ కాలంలో గాలులూ ఎక్కువే. ఇవి మొక్కలు పడిపోయేలా చేస్తాయి. ప్లాస్టిక్‌ షీట్లను వాటికి అడ్డుగా కట్టాలి.
* బాల్కనీ గార్డెనింగ్‌ ఇప్పుడు సాధారణమైపోయింది. మీరు పెంచే వాటిల్లో తక్కువ నీరు సరిపోయేవి ఉంటే వాటిని అక్కడి నుంచి వర్షం పడని ప్రదేశానికి మార్చండి. ఎండగా ఉన్నప్పుడు కావాలంటే మళ్లీ మార్చుకోవచ్చు.
* వర్షం వెలిసిన తర్వాత కుండీల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయేమో చూసుకుని అవసరమైతే తీసేయాలి. ఈ కాలంలో రోజూ నీళ్లు పోయాలన్న నిబంధనేమీ వద్దు. మొక్క మొదలు తడిగా ఉంటే.. కొన్ని రోజులపాటు నీళ్లు పోయకపోయినా ఫర్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్