గోరింట పూసింది...

ఆషాఢంలో అమ్మాయిలంతా గోరింటాకు పెట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకు కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలానే చెబుతారు. ఏది ఏమైనా అరచేయి ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు

Published : 24 Jul 2021 01:26 IST

ఆషాఢంలో అమ్మాయిలంతా గోరింటాకు పెట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకు కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలానే చెబుతారు. ఏది ఏమైనా అరచేయి ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

ఆకుని... చిన్న పటిక ముక్క లేదా రెండు లవంగాలు వేసి రుబ్బండి. ఆపై ఆ ముద్దకు రెండు చుక్కల యూకలిప్టస్‌ నూనె కలిపి ఓ పావుగంట పక్కన పెట్టి తర్వాత చేతికి పెట్టుకోండి. ఎర్రటి రంగు ఖాయం.

* మెహెందీ తీసేశాక పెనంపై ఇంగువ/ లవంగాలను వేసి వేడి చేయండి. ఆ పొగ చేతులకు తగలనిస్తే కాసేపటికి మంచి రంగు వస్తుంది.

* గోరింటాకు పెట్టుకున్నాక... అది ఆరిపోతుంటే చక్కెర, నిమ్మరసం కలిపిన నీళ్లను అద్దుతూ ఉండండి.

* గోరింటాకు తీసేశాక ఆవ/కొబ్బరి నూనెను రాసుకుంటే ఎర్రగా పండుతుంది. పెట్రోలియం జెల్లీ కూడా రాయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్