మసాలా దినుసుల మన్నిక పెరగాలంటే!

వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంటింటో కొన్ని పదార్థాలు పాడైపోతుంటాయి. అందులో మసాలా దినుసులనూ చెప్పొచ్చు.

Published : 26 Jul 2021 01:17 IST

వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంటింటో కొన్ని పదార్థాలు పాడైపోతుంటాయి. అందులో మసాలా దినుసులనూ చెప్పొచ్చు. మరి వీటిని జాగ్రత్తగా భద్రపరచాలంటే ఏం చేయాలి?

* వాతావరణంలో తేమ ఎక్కువ కావడం వల్ల ఆహార పదార్థాలకు బూజు పట్టి పాడవుతుంటాయి. కాబట్టి ఈ కాలంలో దినుసుల్లాంటి వాటిని తేమ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో అస్సలు పెట్టొద్దు.

* కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి...  ఇలా పొడుల రూపంలో నిల్వ చేయొద్దు. అవసరమైనప్పుడు మిక్సీ పట్టుకుంటే తాజాగా ఉండటమే కాకుండా కూర రుచి పెరుగుతుంది. పొడులతో పోలిస్తే దినుసులు చాలాకాలంపాటు పాడవకుండా ఉంటాయి.

* మసాలా దినుసులను ప్లాస్టిక్‌, స్టీలు సీసాల్లో కాకుండా గాజు సీసాల్లో నిల్వ చేస్తే చాలాకాలం పాటు పాడవకుండా ఉంటాయి. అలాగే వీటిని పొడిగా ఉండే ప్రాంతంలో పెట్టడం మరిచిపోవద్దు.

* కొంతమంది పసుపు, కారం, ధనియాల పొడి లాంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో దూర్చేస్తారు. ఇలా చేస్తే వాటి సహజ పరిమళాలు పోతాయి. పొడి కాస్త గడ్డలా మారిపోతుంది.
ఇవి గుర్తుంచుకోండి!

* మసాలా దినుసులను పాన్‌ లేదా అవెన్‌లో వేసి వేడి చేసి భద్రపరిస్తే ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటాయి. వేటికవే విడివిడిగా నిల్వ చేయాలి. వాడుకున్న తర్వాత జార్‌ మూత గట్టిగా పెట్టడం మరిచిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్