అల్లిక అదరహో

అల్లికలు భలే అందంగా ఉంటాయి. రాగి, ఇనుప తీగలు, నార, ఊలు, పురికొస,

Updated : 28 Jul 2021 06:34 IST

అల్లికలు భలే అందంగా ఉంటాయి. రాగి, ఇనుప తీగలు, నార, ఊలు, పురికొస, దారాలతో భిన్న వస్తువులను విభిన్నంగా అల్లడం తెలిసిందే. అలాంటి వికర్స్‌తో ఇంటికి కళ వస్తుందంటున్నారు ఈ తరం అమ్మాయిలు..

కేన్‌తో అల్లిన సోఫాలు, కుర్చీలు, స్టూళ్లు, టీపాయ్‌లు, మోడాలతోబాటు గోడకి తగిలించే అనేక రకాల స్టాండులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో ఇంటికి రాయల్‌ లుక్‌ వస్తుందంటే అతిశయోక్తి కాదు.

* వరండా, హాలును డిపార్ట్‌ చేయడానికి కర్టెన్‌ బదులు వికర్‌ తడికను అమర్చడం వల్ల కళ వస్తుంది. సహజమైన చల్లదనం కోరుకునేవారు సీలింగుకు వెదురు తడికను ఏర్పాటు చేస్తున్నారు.  

* జనపనారతో అల్లిన బొమ్మలు, వాల్‌ హ్యాంగింగులు ఫ్రంట్‌ రూం అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. కార్పెట్లు మొదలు లాండ్రీ బాస్కెట్ల వరకు ఆకట్టుకునే వికర్స్‌ ఇంటి వైభవాన్ని పెంచేవే.

* ఎన్ని రకాల హ్యాండ్‌బ్యాగ్స్‌ ఉన్నా తమకు మరీ మరీ ఇష్టమైనవి వికర్‌ హ్యాండ్‌బ్యాగ్సే అంటున్నారు కాలేజ్‌ పిల్లలు.

* ఇల్లు ఎప్పుడూ ఒకేలా ఉంటే కొంచెం మోనాటనీ వచ్చేస్తుంది. అలాంటప్పుడు వికర్‌ డెకర్స్‌తో ఇంటిని అలంకరిస్తే కొత్త ఉత్సాహం వస్తుంది.

* వికర్‌ సరంజామా చూడముచ్చటగా ఉండటమే కాదు ఏళ్ల తరబడి మన్నుతుంది. బరువు కూడా తక్కువ.

* ప్లాస్టిక్‌ బ్యాస్కెట్లకు బదులుగా వికర్‌ బుట్టలూ బ్యాగులూ వాడమని చెబుతున్నారు పర్యావరణ ప్రేమికులు. అందంగానూ ఉంటాయి, కాలుష్యాన్నీ నివారిస్తాయని చాలామంది వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

ఇలాంటివన్నీ ఫర్నీచర్‌ షాపుల్లో, హ్యాండీ క్రాఫ్ట్స్‌ ఎగ్జిబిషన్లలో దొరుకుతాయి. అభిరుచి, అవసరాలను బట్టి ఇళ్లల్లో అమర్చుకుంటే చూడముచ్చటగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్