నిల్వకూ ఉంది సమయం

ఇంట్లో మిగిలిన ఏ ఆహార పదార్థాన్నైనా ఫ్రిజ్‌లో భద్రపరచడం సీత అలవాటు. రాధిక అయితే మాంసాన్ని ఎక్కువ మొత్తంలో తెప్పించి, కొంచెం మాత్రమే వండుతుంది. మిగతాది రోజుల తరబడి ఫ్రీజర్‌లో వదిలేస్తుంది. ఈ ఇద్దరి అలవాట్లూ మంచివి కావు అంటున్నారు ఆహార నిపుణులు.

Updated : 30 Jul 2021 05:48 IST

ఇంట్లో మిగిలిన ఏ ఆహార పదార్థాన్నైనా ఫ్రిజ్‌లో భద్రపరచడం సీత అలవాటు. రాధిక అయితే మాంసాన్ని ఎక్కువ మొత్తంలో తెప్పించి, కొంచెం మాత్రమే వండుతుంది. మిగతాది రోజుల తరబడి ఫ్రీజర్‌లో వదిలేస్తుంది. ఈ ఇద్దరి అలవాట్లూ మంచివి కావు అంటున్నారు ఆహార నిపుణులు. ఏ పదార్థాన్నైనా నిర్దిష్ట కాలం మాత్రమే నిల్వ ఉంచాలని సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్యాల ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏయే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో అవగాహన తప్పనిసరి అంటున్నారు.

*  ప్రొటీన్‌ ఆహారం ... 2, 4

మాంసాహారంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని నియమిత కాలం మాత్రమే నిల్వ ఉంచాలి. లేదంటే వాటిలో పోషక విలువలు తగ్గుతాయి. పైగా రోగాలూ తప్పవు. వండిన చికెన్‌, చేపలు, రొయ్యలను నాలుగు రోజులు ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. పచ్చి వాటిని రెండు రోజులకన్నా ఎక్కువ ఉంచ కూడదు. ఫ్రీజర్‌లో ఎన్ని రోజులయినా పాడవ్వవు అనుకుంటే మాత్రం అనారోగ్యాలు తథ్యం.

* కూరగాయలు, పండ్లు... 4

బ్రకోలీ, మొక్కజొన్న, బీన్స్‌ వంటివి నాలుగు రోజుల్లోపే ఫ్రిజ్‌లోంచి తీసి, వినియోగించాలి. పొట్ల, కాకర, వంకాయ, దొండ, మునగ వంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నీటిశాతం అధికంగా ఉండే టొమాటో, కీరదోస, దోస, స్ట్రాబెర్రీస్‌ వంటివి నిల్వ ఉండే కొద్దీ వాటిలోని తేమతోపాటు పోషకాల శాతం తగ్గుతుంది. అరటి పండ్లు గది వాతావరణంలోనే పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. ఆకు కూరలను రెండు రోజుల్లోపు వాడితే మంచిది. 

* బ్రెడ్‌, గుడ్లు... 5, 7

ఇంట్లో లేదా బేకరీలో తయారు చేసిన బ్రెడ్‌ను 5 రోజుల్లోపే వినియోగించాలి. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచితే ఫంగస్‌ చేరి, పలు రకాల అనారోగ్యాలను తెచ్చి పెడుతుంది. దీని పట్ల ముఖ్యంగా పిల్లలకు అవగాహన కలిగించాలి. గుడ్లు నిలవ ఉంచడానికి గరిష్ట వ్యవధి వారమే. అంతకు మించితే విషతుల్యమే.

* అన్నం... 3

తాజాగా వండిన అన్నాన్ని గంటలోపు ఫ్రిజ్‌లో పెట్టేస్తే, మూడు రోజులు నిల్వ ఉంటుంది. చల్లార్చిన సూప్స్‌ను మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. వీటిని నాలుగు రోజుల్లోపు వాడెయ్యాలి. పాల పదార్థాలైన వెన్నకు 3 నెలలుకాగా, పెరుగును 3 వారాలపాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. అలాగే కేకును 2 రోజుల్లోపే తినెయ్యాలి. గర్భిణులు వీలైనంత వరకూ తాజా ఆహారాన్నే తీసుకోవాలి. వారానికొకసారి ఫ్రిజ్‌ను శుభ్రపరచి, డోర్‌కు లోపలివైపు ఓ నిమ్మచెక్కను ఉంచితే మంచిది. దుర్వాసన రాకుండా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్