Updated : 30/07/2021 05:47 IST

సరంజామా ఎక్కువైందా!

ఇంటిని సినిమా సెట్‌లా తీర్చిదిద్దడం అంత తేలికేం కాదు. రచయిత్రి, ఆర్గనైజింగ్‌ కన్సల్టెంట్‌ మేరీ కుండో ‘లైఫ్‌ లాండ్రీ’, ‘క్లీన్‌’, ‘నీట్‌’, ‘టైడింగ్‌ అప్‌ విత్‌ మేరీ కుండో’ లాంటి ప్రోగ్రాములు చూస్తే ఎంతో కొంత ప్రేరణ కలుగుతుందనుకోండి! కానీ ఇంటా బయటా అలసిపోయే ఇల్లాళ్లకి ఆ స్ఫూర్తీ ఓర్పూ రోజుల తరబడి ఉండవుగా! మరేం చేయాలంటే? ప్రొఫెషనల్‌ ఆర్గనైజర్ల సలహాలు తీసుకోవాలి....

‘హౌస్‌దట్‌’ నేహా భండారి... ‘దుస్తులు లేదా వస్తువుల్లో పాతబడినవి, వాడనివి అనేకం ఉంటాయి. వాటిని తీసేస్తే ఇల్లు అందంగా, హాయిగా ఉంటుంది’ అంటుంది. ‘ది ఆటిక్‌ లై’ నిపుణురాలు నికితా రాయ్‌క్వార్‌  ‘మనం ఉపయోగించని, పనికి రానివి తీసేయడం వల్ల ఇల్లు కళగా ఉంటుంది. పనికొచ్చేవే ఉంటే చప్పున కనిపిస్తాయి కూడా’ అంటుంది.

ఇంకా ఏం చెబుతున్నారు?

జూ కుర్తీ, పైజమా, స్కార్ఫ్‌ లాంటివి ఒక దగ్గర లేకుంటే వాటిని వెతుక్కోవాలి. దొరక్కపోతే చిరాకు, ఆందోళన. దుస్తులు ఎక్కువెక్కువగా కిక్కిరిసి, గజిబిజిగా ఉంటే ఏది వేసుకోవాలో అర్థంకాదు. అవసరమైనవి మాత్రమే ఉంటే హాయిగా ఉంటుంది. వాడనివి తీసేయడం, తక్కినని నీట్‌గా సర్దడంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటుంది.

* పండుగలప్పుడు శుభ్రం చేస్తారు, స్థలమార్పిడి చేస్తారు. వాటితో పాటు తగ్గించే పని మీద దృష్టిపెట్టాలి.

* మీరే సర్దేట్లయితే ఒక్కసారే మొత్తం పూర్తి చేయాలనుకోవద్దు. రోజుకో భాగం చొప్పున విభజించుకుంటే సులువు.

* వార్డ్‌రోబ్స్‌కు మేరీ కొండో చెప్పిన ‘కోన్‌మేరీ’ పద్ధతి బాగుంటుంది. అంటే.. ముందు దుస్తులు, తర్వాత పుస్తకాలు.. అప్పుడు విసుగు లేకపోగా సరదాగా పనైపోతుంది.

* పర్సులు, మొబైల్స్‌ లాంటివి తలుపు దగ్గర్లో, వంట గిన్నెలు సింక్‌కు దగ్గరగా ఉంటే అందుకోవడం సుఖం.

* ఆయా వస్తువులను డబ్బాల్లో, పెట్టెల్లో అమర్చడంవల్ల అడ్డంగానూ ఉండవు, చూట్టానికీ బాగుంటుంది.

* మన అవసరాలు, ఆలోచనలు, ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏవయితే సులువు, సౌఖ్యం లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మంది పండగలకు పాతబడిన వాటిని తీసేసి కొత్తవాటితో అలంకరిస్తారు. ఎన్నో తర్జన భర్జనల తర్వాత కొన్నింటిని వదిలేస్తారు. అందుకే నిమిషాల్లో అంచనా చేసి తొలగించాల్సిన జాబితా, దేన్నెక్కడ అమర్చాలో క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి.

* పక్కన పెట్టిన వస్తువును చివరి సారిగా ఎన్నాళ్ల క్రితం వాడామో గుర్తుచేసుకుంటే చాలు... దాని అవసరం ఏంటో తెలిసిపోతుంది. అప్పుడు నిర్ణయం తీసుకోవడం తేలిక.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని