వార్డ్‌రోబ్‌లో ఆరోగ్యం!

సౌందర్య పోషణకు ఎంతో తరచి చూసుకుని మరీ కొంటుంటాం. ఈ జాబితాలో దుస్తులనూ చేర్చమంటున్నారు నిపుణులు. చర్మ, కేశాల రక్షణలో వీటి పాత్రా ఉంటుందట. కాబట్టి, మీ వార్డ్‌రోబ్‌లోకి చేర్చే ముందే జాగ్రత్తగా చూసుకోండి. అలా సాయపడే వాటిలో కొన్నివి!

Updated : 01 Aug 2021 04:47 IST

సౌందర్య పోషణకు ఎంతో తరచి చూసుకుని మరీ కొంటుంటాం. ఈ జాబితాలో దుస్తులనూ చేర్చమంటున్నారు నిపుణులు. చర్మ, కేశాల రక్షణలో వీటి పాత్రా ఉంటుందట. కాబట్టి, మీ వార్డ్‌రోబ్‌లోకి చేర్చే ముందే జాగ్రత్తగా చూసుకోండి. అలా సాయపడే వాటిలో కొన్నివి!

* ఆర్గానిక్‌ కాటన్‌: అలర్జీలను దూరంగా ఉంచుతుంది. దీనిలో నేచురల్‌ ఫైబర్‌ ఉంటుంది. చలి కాలంలో వెచ్చగా ఉంచడమే కాక వేసవిలో చెమటను పీల్చుకుని దద్దుర్లకు ఆస్కారమివ్వదు. చర్మానికి శ్వాసించుకునే వీలు కల్పించడమే కాకుండా దుమ్మునీ శరీరంపైకి చేరనివ్వదు. మెత్తగా ఉండి హాయినిస్తుంది, ఎక్కువకాలం మన్నుతుంది కూడా.

* లినెన్‌: వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. 20% వరకూ తేమను పీల్చుకో గలదు. యాంటీ బ్యాక్టీరియల్‌, హైపో అలర్జినిక్‌. సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక. చర్మంలో పీహెచ్‌ స్థాయులను నిలిపి ఉంచుతుంది.

* సిల్క్‌: దీనిలో ప్రొటీన్‌ నిర్మాణం చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. వీటిని దిండు కవర్లకు వేస్తే చర్మం రాపిడికి గురవదు. యాంటీ ఏజెనింగ్‌గానూ పనిచేస్తుంది. తక్కువ నిర్వహణ, బరువు దీని ప్రత్యేకత. పొడి చర్మం ఉన్నవారు ఉపయోగించొచ్చు. పెళుసు బారిన జుట్టు ఉన్నవారికీ ఇది మంచి ఎంపిక.

* విస్కోజ్‌: సెల్యులోజ్‌ ఫైబర్‌తో తయారు చేస్తారు. కాటన్‌/ సిల్క్‌లా మెత్తగా, మృదువుగా ఉంటుంది. సున్నిత చర్మం ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్