ఏ వంటనూనెలో ఏముంది

కుటుంబ ఆరోగ్యం ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. తినే పదార్థాల విషయంలో బోలెడు సలహాలు, మరెన్నో సందేహాలు...ఎదురవుతుంటాయి. వాటిల్లో వంటనూనె కూడా ఒకటి. తేడాలను ముందు తెలుసుకుంటే ఎంచుకోవడం

Published : 02 Aug 2021 01:22 IST

కుటుంబ ఆరోగ్యం ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. తినే పదార్థాల విషయంలో బోలెడు సలహాలు, మరెన్నో సందేహాలు...ఎదురవుతుంటాయి. వాటిల్లో వంటనూనె కూడా ఒకటి. తేడాలను ముందు తెలుసుకుంటే ఎంచుకోవడం సులువు కదూ!

ఆర్గానిక్‌: మొక్కలు, విత్తనాల నుంచి తీసినదాన్ని ఆర్గానిక్‌ ఆయిల్‌గా చెబుతారు. ఎలాంటి రసాయనాలూ ఉపయోగించరు.

వర్జిన్‌/ ఎక్స్‌ట్రా వర్జిన్‌: అన్‌ రిఫైండ్‌, రా ఆయిల్‌గానూ వ్యవహరిస్తారు. దీనిలోనూ రసాయనాలకు తావుండదు. కొద్దిపాటి వేడిని ఉపయోగించి నూనెను తీయడాన్ని ఈవిధంగా వ్యవహరిస్తారు.

కోల్డ్‌ ప్రెస్‌డ్‌: దీనిలో సాధారణ వేడి వద్ద వివిధ విత్తనాల నుంచి నూనెను తీస్తారు. రసాయనాలనూ ఉపయోగించరు. గది ఉష్ణోగ్రత వద్ద సేకరిస్తుండటంతో సూక్ష్మ పోషకాలూ దానిలోనే ఉండిపోతాయి.

రిఫైండ్‌: ఈ నూనె సేకరణలో ఉష్ణోగ్రతతోపాటు కొన్ని రసాయనాలనూ ఉపయోగిస్తారు. దీంతో కొన్నిరకాల పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్