ట్రేలు తుడిచేయండి!

నెలల తరబడి వంటగదిలోని స్టీలు, అల్యూమినియం అరలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా... గ్లాసులు, మూతలు, గిన్నెలు, డబ్బాలు...

Published : 07 Aug 2021 02:48 IST

నెలల తరబడి వంటగదిలోని స్టీలు, అల్యూమినియం అరలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా... గ్లాసులు, మూతలు, గిన్నెలు, డబ్బాలు... ఇలా కావాల్సినవన్నీ పెట్టుకునే అరలు మురికిగా మారితే సరైన శుభ్రత లేక తుప్పు పడితే.. అమ్మ బాబోయ్‌ అనుకుంటున్నారా... అయితే ఇది మీ కోసమే...

ట్రేలను (స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ అరలు) నెలకోసారైనా శుభ్రం చేయాలి. లేదంటే తడి వల్ల బూజు, తుప్పు పడతాయి.

* గిన్నెలను కడిగిన వెంటనే వీటిలో పెట్టేస్తుంటారు చాలామంది. ఇలా చేస్తే ట్రేలు త్వరగా పాడవుతాయి.

* వీటిని శుభ్రం చేయడానికి మీరే సొంతంగా క్లీనింగ్‌ సొల్యూషన్‌ను తయారు చేసుకోవచ్చు. చెంచా చొప్పున ఉప్పు, వంటసోడా, లిక్విడ్‌ డిష్‌ వాషర్‌, నిమ్మరసం తీసుకుని పేస్ట్‌లా చేసుకోండి.  స్క్రబ్బర్‌తో లేదా పాత టూత్‌ బ్రష్‌తో ఈ పేస్ట్‌ను ట్రాలీపై రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే సరి. ఉప్పు వల్ల తుప్పు, ఫంగస్‌ రెండూ పోతాయి. పూర్తిగా నీటితో కడగాలనుకుంటే శుభ్రం చేసిన తర్వాత తప్పనిసరిగా ఎండలో పెట్టాలి.

* ట్రేలు పూర్తిగా శుభ్రమయ్యాక కొబ్బరి నూనెలో దూది ఉండను ముంచి వాటిని తుడిస్తే చక్కగా మెరుస్తాయి. ఆవనూనెనూ వాడొచ్చు. ఈ నూనె పెట్టి గంట తర్వాత ట్రేను బాక్స్‌లో సర్దేయాలి.

* తడిగా ఉన్న గిన్నెలను స్టీలు అరల్లో వెంటనే సర్దేయొద్దు. పూర్తిగా తడారి పోయిన తర్వాతే లోపల పెట్టాలి. పొడి వస్త్రంతో ఎప్పటికప్పుడు తుడుస్తుండాలి. ఇలా చేస్తే నీటి మరకలు పడవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్