ఒత్తిడి తగ్గించే వంటగది

మహిళలు... ఎక్కువ సమయం గడిపే చోటు వంటిల్లే. అది శుభ్రంగానే కాదు..సౌకర్యంగా, ఆహ్లాదంగానూ ఉండాలి. అప్పుడే ఒత్తిడి దరిచేరదు.

Published : 09 Aug 2021 01:07 IST

మహిళలు... ఎక్కువ సమయం గడిపే చోటు వంటిల్లే. అది శుభ్రంగానే కాదు..సౌకర్యంగా, ఆహ్లాదంగానూ ఉండాలి. అప్పుడే ఒత్తిడి దరిచేరదు.

* వంటగదిలో ఎంత తక్కువ సామాను ఉంటే అంత మంచిది. నిల్వ సరకులన్నింటినీ పై ర్యాకుల్లో సర్దేసి...కింద అరల్లో రోజువారీ అవసరాలకు వాడేవే ఉంచుకోండి. అప్పుడే వంటగదీ చూడ్డానికి శుభ్రంగా ఉంటుంది.

* పప్పులు, మసాలా దినుసులు, సాస్‌లూ, పాస్తాలూ, నూనెలూ, నట్స్‌ వంటి వంటింటి సరకులన్నీ గాజు సీసాల్లో నింపింతే ఏవి ఉన్నాయో, ఏవి అయిపోవచ్చాయో తెలుస్తుంది. పైగా పర్యావరణహితం కూడాను.

* వివిధ రకాల ఆహార పదార్థాల ప్యాకెట్లను కత్తిరించి వాటిల్లో గాలి చొరకుండా క్లిప్‌లు వచ్చాయి. వాటిని తీసుకుని...అలాంటివన్నీ ఓ పెద్ద డబ్బాలో పెడితే పాడవ్వవు. అల్మారాలు చిందరవందరగానూ కనిపించవు.

* వంటగది కిటికీల్లో కొత్తిమీర, పాలకూర, పుదీనా వంటి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇవి వేగంగా పెరుగుతాయి. వీటి తాజా ఆకులని వంటల్లోకి వాడితే ఆ రుచేవేరు.

* గ్యాస్‌ వెనక గోడలపై...యాంటీగ్రీజ్‌ షీట్లు దొరుకుతున్నాయి. వాటిని అంటిస్తే నూనె మరకలు చేరవు. వంటగదిలో ఓ బ్లాక్‌బోర్డు లేదా ఓ వాల్‌ బుక్‌ ఏర్పాటు చేసుకుంటే వంట ప్రణాళిక రాసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్