ఈ మూడింటితో మొటిమలు దూరం

అమ్మాయిలకు ప్రధాన సమస్య మొటిమలు. అయినా వాటిని తేలిగ్గానే ఎదుర్కోవచ్చు. ఎలా అంటారా? రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగాలి. నీరు శరీరానికి ఆక్సిజన్‌ అందిస్తుంది. చర్మంలోని మలినాలు బయటికి పోయేలా చేస్తుంది.....

Updated : 14 Aug 2021 04:50 IST

అమ్మాయిలకు ప్రధాన సమస్య మొటిమలు. అయినా వాటిని తేలిగ్గానే ఎదుర్కోవచ్చు. ఎలా అంటారా?

నీరు: రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగాలి. నీరు శరీరానికి ఆక్సిజన్‌ అందిస్తుంది. చర్మంలోని మలినాలు బయటికి పోయేలా చేస్తుంది.

నిమ్మ: రోజూ ఓ గ్లాసు నిమ్మరసాన్ని తీసుకోండి. నిమ్మలోని  సిట్రిక్‌ యాసిడ్‌ లివర్‌లోని వ్యర్థాలను తొలగించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

ఆలివ్‌ నూనె: మొటిమలకు మంచి మందు. చర్మంలో త్వరగా ఇంకిపోతుంది. దీంతో ముఖాన్ని ఉదయం, రాత్రి మర్దనా చేసుకుంటే చర్మకణాలు పూడి పోకుండా నియంత్రిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. అలానే నూనె పదార్థాలకూ దూరంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్