ఆకుపచ్చని శ్రావణం!

శ్రావణం శుక్రవారం నాడు వ్రతంలో అలంకరణదీ ప్రధాన పాత్రే! అలాగని పూలే అక్కర్లేదు. ఆకులతోనూ అందంగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు డెకార్‌ బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. ఇందుకు కొన్ని సూచనలూ చేస్తున్నారు.

Published : 17 Aug 2021 01:43 IST

శ్రావణం శుక్రవారం నాడు వ్రతంలో అలంకరణదీ ప్రధాన పాత్రే! అలాగని పూలే అక్కర్లేదు. ఆకులతోనూ అందంగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు డెకార్‌ బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. ఇందుకు కొన్ని సూచనలూ చేస్తున్నారు.

* రెండు కర్రలు నిలువుగా, ఒక కర్ర అడ్డంగా వచ్చేలా ఓ ఫ్రేమ్‌ ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఆకుపచ్చ రంగు కర్టెన్‌ వేలాడదీయండి. ఆ వస్త్రంపై అరిటాకులు/ విస్తరాకులు/ తమలపాకులు వంటి వాటిని గుండు సూదులతో అతికించాలి. చివరగా అక్కడక్కడా పూలు పెడితే.... నిండుగా కనిపిస్తుంది.

* ఆకులతో ఉన్న అరటిపిలకను బిందెల్లో మట్టిపోసి పీటకు అటూ ఇటూ పెట్టినా పచ్చదనంతో అలరారుతుంది. గోధుమలు, ధాన్యం వంటివి చిన్న చిన్న డబ్బాల్లో మొలకెత్తించి పూజ మండపం చుట్టూ పెట్టినా బాగుంటుంది.

* ఇక, మామిడాకులు, కొబ్బరాకులతో తోరణాలు సులువుగా చేసుకోవచ్చు. అరటి/ కొబ్బరి ఆకులతో చక్కటి చిలుకలు చేసుకోవచ్చు. అరిటాకులు, విస్తరాకులతో చిన్న చిన్న ప్లేట్లు, గిన్నెలు చేసుకుంటే... ప్రసాదాల రుచి పెరుగుతుంది. అలాంటి కొన్ని డిజైన్లే ఇవన్నీ... ఇవి చూస్తే మీకూ మరిన్ని ఆలోచనలు రావొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్