వంటింట్లో బీట్‌రూట్‌ పెంచేద్దామా!

తాజాగా అప్పటికప్పుడు కోసి వండిన కూర రుచే వేరు కదా! పైగా ఇప్పుడు రసాయనాలు వాడకుండా పండించిన వాటికి ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో ఎంతోమంది పెరటి, మిద్దె తోటలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటిల్లోకి బీట్‌రూట్‌నూ చేర్చుకోండి. స్థలం లేని వాళ్లు కుండీల్లోనూ పెంచేసుకోవచ్చు. 

Published : 17 Aug 2021 01:43 IST

తాజాగా అప్పటికప్పుడు కోసి వండిన కూర రుచే వేరు కదా! పైగా ఇప్పుడు రసాయనాలు వాడకుండా పండించిన వాటికి ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో ఎంతోమంది పెరటి, మిద్దె తోటలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటిల్లోకి బీట్‌రూట్‌నూ చేర్చుకోండి. స్థలం లేని వాళ్లు కుండీల్లోనూ పెంచేసుకోవచ్చు.

కావాల్సినవి: ఒక బీట్‌రూట్‌, ఒక గిన్నె, నీళ్లు, పాటింగ్‌ మిక్స్‌, కుండీ.

* బీట్‌రూట్‌ పై భాగాన్ని ఎండిన ఆకులతో సహా 2 నుంచి 3 ఇంచుల వరకూ కోసి గిన్నెలో ఉంచాలి. సగం మునిగే వరకూ నీటిని పోయాలి. పూర్తిగా మునిగేలా పోస్తే కుళ్లిపోయే ప్రమాదముంది.

* దీన్ని వంటగదిలో లేదా కిటికీలో ఎక్కడైనా నేరుగా సూర్యకాంతి పడనిచోట ఉంచాలి. మూడు, నాలుగు రోజుల్లో లేత ఆకులు రావడాన్ని గమనిస్తారు. రోజు విడిచి రోజు నీళ్లు తప్పక పోయాలి. 

* పదిహేను రోజుల్లో పెద్ద ఆకులు వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని కుండీలోకి మార్చుకుంటే సరి. దీన్ని పాక్షికంగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచి, తరచూ నీళ్లు పోయాలి. ఇలా మూడు నుంచి నాలుగు నెలలు పూలు పూసే వరకూ చేయాలి. పూలు, కాడలను నీడలో ఎండబెడితే తర్వాత విత్తనాలుగానూ పనికొస్తాయి. సాధారణంగా 90 రోజులకు దుంపలు తీయవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్