Updated : 19/08/2021 12:43 IST

అందాల వరలక్ష్మి!

మ్మాయిలకు అలంకరణపై మక్కువ ఎక్కువ. మరి తామెంతో ఇష్టంగా చేసుకునే వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని కూడా అంతే అందంగా తీర్చిదిద్దుతారు. అదెలాగో చెబుతున్నారు డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. లక్షీ దేవి విగ్రహం ఉంటే సరే సరి. లేదంటే కలశాన్నే ఆమె ప్రతిరూపంగా భావించొచ్చు. కళ్లను ఆకర్షించే పసుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో జరీ అంచున్న దుపట్టా లేదా చీరను ఇందుకోసం ఎంచుకోవాలి.  కాస్త ఎత్తులో ఉండే పీట ఏర్పాటు చేసుకుని ఓ పళ్లెంలో బియ్యం పోసి ఆపై చెంబుని నిలబెట్టాలి. దాని మూతి దగ్గర ఓ స్కేలుని తాడుతో కట్టాలి. ఇప్పుడు చీరను నిలువుగా మడతపెట్టి చక్కగా కుచ్చిళ్లు పెట్టుకోవాలి. చివరి వరకూ పెట్టుకున్నాక మధ్యకు మడతపెట్టి కలశం చుట్టూ అందంగా అమర్చి పిన్నులు పెట్టాలి. కొబ్బరికాయకు అమ్మవారి ముఖాన్ని అతికించాలి. మెడలో నగలూ వేసి, ఓ చిన్న పూల జడా, స్కేలుకి గాజులు నిండుగా వేస్తే చూడముచ్చటగా ఉంటుంది. మన ఆసక్తిని బట్టి చీరని రకరకాలుగానూ కట్టొచ్చు. అలాంటి కొన్ని వరలక్ష్మీ రూపాలివి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని