వెరైటీ బాంబులు

మబ్బులు నిండిన ఆకాశం. మెల్లగా మొదలయ్యాయి చిటపట చినుకులు. ఇలాంటి వాతావరణంలో ఓ కప్పు వెచ్చని టీ తాగుతూ... ఇష్టమైన పుస్తకం చదివితే... ఆహా! అయితే అప్పటికప్పుడు టీ చేయడం బోర్‌ అనుకోనక్కర్లేదు

Published : 07 Sep 2021 00:39 IST

మబ్బులు నిండిన ఆకాశం. మెల్లగా మొదలయ్యాయి చిటపట చినుకులు. ఇలాంటి వాతావరణంలో ఓ కప్పు వెచ్చని టీ తాగుతూ... ఇష్టమైన పుస్తకం చదివితే... ఆహా! అయితే అప్పటికప్పుడు టీ చేయడం బోర్‌ అనుకోనక్కర్లేదు. ఈ టీ బాంబ్స్‌ సిద్ధం చేసుకుంటే... కావాల్సినప్పుడు సులువుగా వాడుకోవచ్చు.

తయారీ... కప్పు చక్కెర లేదా బ్రౌన్‌షుగర్‌ను చిక్కని పాకంలా కాయాలి. ఇప్పుడు ఓ సిలికాన్‌ ట్రే తీసుకుని వేడి పాకాన్ని దాన్ని గుంతల్లో బ్రష్‌తో రాయండి. ఆపై అది పూర్తిగా చల్లారాక ట్రే నుంచి విడదీయాలి. అప్పుడవి గుండ్రటి గిన్నె సగ భాగాలుగా కనిపిస్తాయి. వాటిల్లో గ్రీన్‌టీ ఆకులు, డ్రైఫ్లవర్స్‌, హెర్బ్స్‌ వంటి వాటిని నింపుకోవచ్చు. ఇప్పుడు ఓ ప్లేటుని వేడి చేసి దానిపై ఖాళీగా ఉన్న మరో సగభాగాన్ని పెడితే కొద్దిగా అంచులు కరుగుతాయి. దీంతో టీ ఆకులు వేసిన బౌల్‌ని మూస్తే అతుక్కుని టీ బాంబ్‌ సిద్ధమవుతుంది. దీన్ని వేడి నీళ్లలో వదిలితే... చాలు పొగలుకక్కే టీ సిద్ధం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్