మినియేచర్లతో రికార్డులు

‘ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. అవి చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోవాలి’ అనేది ఆయేషా రూబా కోరిక. కానీ చదువుతో తీరికే ఉండేది కాదు. లాక్‌డౌన్‌ రూపంలో అవకాశం వచ్చింది. బోలెడంత సమయం దొరకడంతో ప్రయత్నిద్దామనుకుంది.

Updated : 14 Sep 2021 13:08 IST

‘ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. అవి చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోవాలి’ అనేది ఆయేషా రూబా కోరిక. కానీ చదువుతో తీరికే ఉండేది కాదు. లాక్‌డౌన్‌ రూపంలో అవకాశం వచ్చింది. బోలెడంత సమయం దొరకడంతో ప్రయత్నిద్దామనుకుంది. రూబా వాళ్లమ్మకి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు గుర్తుగా ఏదైనా చిన్న వస్తువును తెచ్చుకునే అలవాటుండేది. వాటిల్లో ఫ్రిజ్‌ మాగ్నెట్లే ఎక్కువ. దీంతో మినియేచర్‌ వస్తువులను తయారు చేద్దామనుకుంది. మట్టితో చేయడం ప్రారంభించింది. ఎన్నోసార్లు విఫలమైనా ప్రయత్నించింది. తినే వస్తువులు తర్వాత కీచెయిన్లు, పెండెంట్లు, గృహోపకరణాలు.. ఇలా ఒక్కోటీ రూపొందించింది. బీబీఏ పూర్తిచేసిన ఈమె వీటితో ఇప్పటికే ఇండియాతోపాటు ఆసియా, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులనూ సాధించింది. దీన్ని ఉపాధి మార్గంగా మలచుకుని ఆన్‌లైన్‌ వేదికగా అమ్ముతోంది కూడా. వినియోగదారులకు కావాల్సిన విధానంలోనూ చేసిపెడుతోందీ బెంగళూరు అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్