చిన్నారి దుస్తులకు.. చిట్టి మెషీన్‌

పిల్లల దుస్తుల్ని పెద్దవాళ్ల వాటితో కలిపి మెషిన్‌లో వేద్దామంటే మనసొప్పదు. పోనీ వాళ్లవే విడిగా వేసేంతా ఉండవు. వీటికి ఈ చిట్టి వాషింగ్‌ మెషిన్‌ మంచి పరిష్కారం. పిల్లలవే కాదు.. టాప్స్‌, టీషర్టులు, సాక్సులు, షార్ట్స్‌, లోదుస్తులను విడిగా ఉతుక్కోవాలనుకునే వారూ ఎంచుకోవచ్చు.

Updated : 14 Sep 2021 13:20 IST

పిల్లల దుస్తుల్ని పెద్దవాళ్ల వాటితో కలిపి మెషీన్‌లో వేద్దామంటే మనసొప్పదు. పోనీ వాళ్లవే విడిగా వేసేంతా ఉండవు. వీటికి ఈ చిట్టి వాషింగ్‌ మెషీన్‌ మంచి పరిష్కారం. పిల్లలవే కాదు.. టాప్స్‌, టీషర్టులు, సాక్సులు, షార్ట్స్‌, లోదుస్తులను విడిగా ఉతుక్కోవాలనుకునే వారూ ఎంచుకోవచ్చు. ఉతకాల్సిన వాటిని వేసి పవర్‌ బటన్‌ను మూడు సెకన్లపాటు నొక్కితే చాలు పని ప్రారంభించేస్తుంది. ఈ పోర్టబుల్‌ వాషింగ్‌ మెషీన్‌ని పని పూర్తయ్యాక మడిచి పక్కన పెట్టేసుకోవచ్చు. దీంతో ప్రయాణాల్లోనూ అనుకూలం. శబ్దం చేయక పోవడమే కాదు.. తక్కువ కరెంట్‌నీ తీసుకుంటుందట. ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్