దాంపత్యానికి దూరమవుతున్నారా..
అధిక పనివేళలు, ఇంటికి చేరిన ఆఫీస్ విధులు... జీవితాన్ని యాంత్రికంగా మారుస్తున్నాయి. ఇవన్నీ పలు శారీరక, మానసిక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిని పరిష్కరించుకుని, నిండైన దాంపత్య జీవితం పొందడం కోసం మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే....
అధిక పనివేళలు, ఇంటికి చేరిన ఆఫీస్ విధులు... జీవితాన్ని యాంత్రికంగా మారుస్తున్నాయి. ఇవన్నీ పలు శారీరక, మానసిక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిని పరిష్కరించుకుని, నిండైన దాంపత్య జీవితం పొందడం కోసం మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే....
ఆఫీస్ పనిని పడకగదిలోకి తీసుకు రాకుండా ఉంటే మంచిది. సెల్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్లనూ దూరంగా ఉంచాలి. లేదంటే ఇద్దరిలో ఒకరు ఫోన్‌లో బిజీగా ఉంటే, తమను నిర్లక్ష్యం చేస్తున్నట్లు రెండో వ్యక్తి భావించే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అంశాలను రాత్రి సమయాల్లో చర్చకు తీసుకు రాకూడదు. ఆరోజు జరిగిన విశేషాలు లేదా ఇరువురికి సంబంధించిన అంశాలను చెప్పుకోవాలి. ఆ ఏకాంతాన్ని మీ కోసమే అన్నట్లుగా వినియోగించుకోవాలి. అది మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. ఆ సంభాషణ ఇద్దరినీ దగ్గర చేస్తుంది.
అలా వద్దు...
కొందరు సమయం సందర్భం లేకుండా ఎదుటి వారిని ఆక్షేపించడం, ఆరోపించడం చేస్తుంటారు. ఈ లక్షణాన్ని వీలైనంత త్వరగా గుర్తించి, తగ్గించుకుంటే మంచిది. లేదంటే అది ఇరువురి అనుబంధాన్ని దూరం చేస్తుంది. భాగస్వామిని నిందించడం కాకుండా, మనసులోని ఆలోచనను మృదువుగా చెప్పడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న విషయాలనే పోట్లాటగా మార్చుకోకుండా, ఇద్దరూ కూర్చుని విశ్లేషించుకుంటే పరిష్కారం దొరుకుతుంది.
ఆరోగ్యంగా
దాంపత్య జీవితానికి ఆరోగ్యం అతి ముఖ్యమైంది. సమయం ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి నడవడం లేదా అవుట్‌డోర్ గేమ్స్ ఆడటం వంటివి ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో ఏ ఒడుదొడుకులు రావు. పడకగదిలో వార్తలు, రాజకీయ అంశాలపై వచ్చే చర్చలు కూడా ఒక్కొక్కసారి సమయాన్ని వృథా చేయడమే కాదు, విబేధాలకు కారణమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- చెమట ఎక్కువగా పడుతోందా?
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
- స్ట్రెచ్ మార్క్స్‌కి బేకింగ్ సోడా..
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
ఆరోగ్యమస్తు
- బరువు తగ్గించే ‘బీరకాయ సూప్’!
- చక్కెర పానీయాలు వద్దు... పండ్ల రసాలే ముద్దు!
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
అనుబంధం
- ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు..!
- గర్భస్రావం అయ్యాక..!
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
యూత్ కార్నర్
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- గెలుపు కథ రాసుకున్నారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
'స్వీట్' హోం
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
- విరిగిన పాలతో ఇలా!
వర్క్ & లైఫ్
- ప్రయాణాల కోసం ‘సోప్ పేపర్’!
- నిండైన నీల లత అందం!
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...