ఖర్చుకి కళ్లెం వేద్దాం!

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. వాటిని తమ చేతిమీదిగా ఉపయోగించే ఆర్థిక స్వాతంత్య్రమూ పెరిగింది. అలాగని పొదుపు ఊసే లేకపోతే, ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకోకపోతే

Published : 20 Sep 2021 01:03 IST

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. వాటిని తమ చేతిమీదిగా ఉపయోగించే ఆర్థిక స్వాతంత్య్రమూ పెరిగింది. అలాగని పొదుపు ఊసే లేకపోతే, ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకోకపోతే భవిష్యత్తులో ఒడిదొడుకులు తప్పవు. అలాంటివారు ఈ చిట్కాలు పాటించి చూడండి.

* ప్రణాళిక అవసరం... ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్లు...ఏ ఖర్చు అయినా సంపాదనకు తగ్గట్లే ఉండాలి. అలాకాకుండా చేతికి డబ్బులు వచ్చిన పది పదిహేను రోజులకే మొత్తం ఖర్చయిపోతే మీ బండి గాడి తప్పుతున్నట్లే. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే...ప్రణాళిక తప్పనిసరి. ఆ పని జీతం చేతికి రాకముందే అయిపోవాలి. ఆ తర్వాతే...ఇతరత్రా ఖర్చులు.

* లెక్కరాయండి... నెల జీతంలో ఎక్కువ మొత్తం ఖర్చుచేస్తున్నవి ఏమిటో ఓ కాగితంపై రాసుకోండి. వాటిని ఏ మాత్రం వరకూ ఖర్చు తగ్గించుకునే వీలుందో చూడండి. బయటి ఆహారం తినడం, ఖరీదైన ప్రాంతంలో ఇంటి అద్దె, పోస్ట్‌పెయిడ్‌ బిల్లులు, ఇంటర్నెట్‌ వాడకం వంటివెన్నో వీటిల్లో ఉంటాయి. కొందరమ్మాయిలైతే లెక్కకు మించిన వస్తువులను షాపింగ్‌ చేస్తూనే ఉంటారు. వాటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే...ఈ పద్ధతి తప్పపనిసరి. అప్పుడే వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. మొదట కష్టమైనా క్రమంగా అలవాటు పడతారు. 

* పొదుపు బాటలో...డబ్బులు మిగిలితేగా పొదుపు చేయడానికి అంటుంటారు కొందరు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే వచ్చే జీతంలో కనీసం పదిశాతం భవిష్యత్‌ అవసరాలకు పొదుపుగా పక్కన పెట్టిన తర్వాతే ఖర్చులు చూసుకోండి. స్మార్ట్‌ బ్యాంకింగ్‌తో అంటూ నెలనెలా కొంత చెల్లించేలా మ్యూచువల్‌ ఫండ్లు...ఇతరత్రా  పెట్టుబడులు, పొదుపు ఖాతాలు ఏర్పరుచుకోండి. ఇవన్నీ మీరు ఆర్థికంగా మీరు బలోపేతం అయ్యేందుకు తోడ్పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్