సబ్బు, పేస్ట్‌... వాడేద్దామిలా!

రోజువారీ ఉపయోగించే వస్తువులు, పదార్థాలకు కొన్నాళ్ల తర్వాత గడువు ముగిసిపోతుంది. అలాంటప్పుడు వాటిని వృథాగా పారేయకుండా ఉపయోగించడిలా...టూత్‌పేస్ట్‌... గడువు ముగిసిన టూత్‌ పేస్ట్‌ను మొండి మరకలను తొలగించడానికి ఉపయోగించవచ్చు.

Published : 20 Sep 2021 01:03 IST

రోజువారీ ఉపయోగించే వస్తువులు, పదార్థాలకు కొన్నాళ్ల తర్వాత గడువు ముగిసిపోతుంది. అలాంటప్పుడు వాటిని వృథాగా పారేయకుండా ఉపయోగించడిలా...

టూత్‌పేస్ట్‌... గడువు ముగిసిన టూత్‌ పేస్ట్‌ను మొండి మరకలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. గోడలపై గీసిన క్రేయాన్‌ గీతలు, రంగులు, ఆహార పదార్థాల మరకలపై కాస్తంత టూత్‌పేస్ట్‌ రాసి కాసేపాగి తడి వస్త్రంతో తుడిస్తే మరకలు పోతాయి. షూస్‌పై పడిన మరకలనూ ఇది వదలగొడుతుంది.

సబ్బు... ఎక్స్‌పైరీ లేదా మిగిలిపోయిన సబ్బు ముక్కలను స్క్రూలు, బ్లేడ్స్‌ను వదులుగా చేసేందుకు వాడొచ్చు. అలాగే పాత జిప్‌లను తేలిగ్గా తీయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రాత్రిపూట చిన్నారుల బూట్లలో సబ్బు ముక్కలను కాగితంతో చుట్టి పెడితే మర్నాటి కల్లా దుర్వాసన దూరమవుతుంది.

షాంపూ... దీంతో ఆక్సిడైజ్‌ నగలను శుభ్రం చేయొచ్చు. అలాగే డిటర్జంట్‌లా ఇల్లు శుభ్రం చేయడంలో వాడుకోవచ్చు.

లూఫా... దీన్ని రెండు నెలలకు మించి వాడొద్దంటారు. అయితే ఆ తర్వాత దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఎస్సెన్షియల్‌ నూనె చుక్కలను దీనిపై చల్లి దుర్వాసనల వచ్చే చోట పెడితే అక్కడంతా సువాసనలు వెలువడతాయి.

వెట్‌ వైప్స్‌.. వీటికీ గడువు తేదీ ఉంటుంది. ఇది ముగిసిపోయిన తర్వాత వీటితో హ్యాండ్‌ బ్యాగులు, పర్సులను శుభ్రం చేయొచ్చు. అలాగే ఫ్యాన్‌ రెక్కలు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ను కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్