అందాన్ని పెంచే ఐస్‌క్యూబ్స్
నిద్రలేచిన వెంటనే ముఖాన్ని ఐస్‌క్యూబ్‌తో చేసే మృదువైన మర్దన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే మేకప్ వేసుకునే ముందు దీంతో చేసే మసాజ్ ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చేస్తుంది.
నిద్రలేచిన వెంటనే ముఖాన్ని ఐస్‌క్యూబ్‌తో చేసే మృదువైన మర్దన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే మేకప్ వేసుకునే ముందు దీంతో చేసే మసాజ్ ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చేస్తుంది. ఐస్క్యూబ్కు మరిన్ని సహజసిద్ధ పదార్థాలను కలిపి ఫ్రీజ్ చేేస్తే ముఖారవిందానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి. వీటిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
* తులసి ఆకులతో...
గుప్పెడు తులసి ఆకులకు కప్పు నీటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి బాగా కలిపి ఐస్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ ఐస్‌క్యూబ్‌తో చేసే మర్దనా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ముఖంపై మచ్చలను తొలగిస్తుంది.
* కాఫీపొడితో... మరుగుతున్న కప్పు నీళ్లలో రెండు చెంచాల కాఫీ పొడిని వేసి బాగా మరగనిచ్చి దింపేయాలి. చల్లార్చి ఐస్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేస్తే కాఫీ క్యూబ్స్ సిద్ధం. ఇవి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.
* పాలతో
ముప్పావుకప్పు కాచిన పాలల్లో పావు కప్పు నీటిని కలిపి ఐస్ ట్రేలో నింపాలి. ఫ్రీజ్ అయిన ఈ క్యూబ్స్‌తో మర్దనా చేస్తే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. వెడల్పైన సీసాలో శుభ్రం చేసిన అరకప్పు బియ్యం వేసి రెండు కప్పుల నీటిని నింపాలి. దీన్ని నాలుగు గంటలు నాననివ్వాలి. తర్వాత వడకట్టిన ఆ నీటిని ఐస్‌క్యూబ్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేయాలి. వీటితో రోజూ ఉదయాన్నే ముఖాన్ని మృదువుగా మసాజ్ చేసుకుంటే ముఖచర్మం ఆరోగ్యంగా మారుతుంది.
* రోజ్‌వాటర్‌తో
కప్పు నీటిలో కప్పు గులాబీ నీటిని కలిపి ఫ్రీజ్ చేస్తే చాలు. ఈ క్యూబ్స్‌తో మర్దనా చేస్తే ముఖం కాంతిమంతంగా మారుతుంది. అలాగే రెండు గ్రీన్‌టీ బ్యాగులను మరిగే కప్పు నీటిలో వేయాలి. చల్లారిన తర్వాత క్యూబ్స్‌గా చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంపై వృద్ధాప్య ఛాయలను, మొటిమలను, కంటిచుట్టూ నల్లని వలయాలను దూరం చేస్తాయి.
* దాల్చిన చెక్కతో
కప్పునీటిలో చెంచా మెత్తగా చేసి ఉంచుకున్న దాల్చిన చెక్క పొడిని కలిపి ఐస్ క్యూబ్స్‌లా చేసుకోవాలి. దీంతో ముఖంపై మసాజ్ చేసి గంట తర్వాత శుభ్రపరుచుకుంటే చాలు. చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!