Updated : 09/10/2021 05:06 IST

జడే వేసే మెషిన్‌!

ఫొటోలో కనిపిస్తున్న చిన్న పరికరంతో ఎంచక్కా జడ (మూడు పాయలతో) వేసుకోవచ్చు. అందులోనూ  ఎంత సన్నటి పాయలతోనైనా సరే. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. ఈ కిట్‌లో దువ్వెన, రబ్బరు బ్యాండ్లు, రబ్బరు బ్యాండ్‌ హోల్డర్లు, హెయిర్‌ స్టిక్స్‌, ఫిక్సింగ్‌ బార్స్‌, హెయిర్‌ హోల్డర్స్‌ ఉంటాయి. 

వేసుకోండిలా.. సెపరేటర్‌తో జుట్టును మూడు పాయలుగా విభజించుకోవాలి. ఆ తర్వాత పరికరానికి మొదట్లో ఉన్న మూడు హుక్స్‌ (పుల్లలు)ల నుంచి జుట్టును బయటకు తీయాలి. ఆ మూడు పుల్లలను ట్యూబ్‌ నుంచి కిందకు లాగాలి. ఇప్పుడు మీట నొక్కితే చాలు హుక్స్‌ నుంచి మూడు పాయలు వాటంతట అవే జడ అల్లుకుంటూ ముందుకు కదులుతాయి. పూర్తి జడ అయిపోయాక రబ్బరు బ్యాండు పెడితే సరి. భలే ఉంది కదూ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని