Updated : 15/10/2021 05:43 IST

విజయ రాజరాజేశ్వరీ దేవి

అంబా శాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

సరా రోజుల్లో ఇదే చివరి అలంకారం. వామహస్తంలో చెరకు గడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటారు. రాజులంటే పాలకులు. రాజరాజులంటే వారి అధికారులు. రాజరాజేశ్వరి అంటే ఉన్నతోన్నత అధికార పీఠాన్ని ఆదర్శ ప్రాయంగా, అభ్యుదయకరంగా నిర్వహించగల సామర్థ్యానికి ప్రతీక. వివిధ జీవన దశల్లో బాల, తరుణి, వృద్ధ రూపాల్లో ఉన్న లలితాత్రిపురసుందరి రాజరాజేశ్వరిగా పరిపాలన రంగంలో అఖండ విజయాలను సాధించగలుగుతోంది. అలా విజయం సాధించిన మహిళల్ని ప్రతి ఆడపిల్లా ఆదర్శంగా తీసుకోవాలి. ఆ జగన్మాతను మనసారా పూజిస్తూ... దేవీరూపాల్లోని అంతరార్థాలను అర్థం చేసుకోవాలి.


Advertisement

మరిన్ని