Published : 27/10/2021 01:58 IST

చెక్క సామాను మెరిపిద్దాం...

చెక్క సామాన్లు ఎంత ఖరీదైనవైనా ఎప్పటికప్పుడు శుభ్ర పరచకపోతే కొద్ది కాలంలోనే కళావిహీనంగా మారిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి...
పొడి వస్త్రంతో రోజూ చెక్క సామాన్లపై దుమ్ము, ధూళిని శుభ్రం చేయాలి. ఈ ఫర్నిచర్‌కు వేడి, తడి తగలకుండా జాగ్రత్త పడాలి. కనీసం ఆరు నెలలకొకసారి వార్నిష్‌తో ఈ ఫర్నిచర్‌ను బ్రష్‌ చేయాలి.

*కొబ్బరి నూనెలో ముంచిన వస్త్రంతో మూడు నెలలకొకసారి తుడవాలి. వ్యాక్సింగ్‌ కూడా మంచిదే. ఇలా చేస్తే అది చెక్కపైన పొరగా ఉండి మెరుపు తగ్గకుండా కాపాడు తుంది. ఎండ పడని చోట వీటిని ఉంచితే కొత్తదనాన్ని కోల్పోవు.
* వాతావరణంలో చెమ్మకి కొన్నిసార్లు చెక్క సామాను, సొరుగుల నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీన్ని పోగొట్టాలంటే కాస్తంత వంటసోడా చల్లాలి. సొరుగుల్లో బొగ్గు ముక్కలు వేసిన చిన్న గిన్నెను ఉంచినా దుర్వాసన దూరమవుతుంది.
* మిగతా ఫర్నిచర్‌ను శుభ్రం చేసే లిక్విడ్స్‌తో చెక్క సామాన్లను తుడవకూడదు. ఫెదర్‌ డస్టర్‌తో లేదా ఫర్నిచర్‌ ఆయిల్‌తో శుభ్రపరుస్తుంటే మెరుస్తూ ఉంటాయి. గదికే కొత్త అందాన్ని తెస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని