వీటిపై కన్నేయండి!
మిగతా ఏ పండగలైనా.. ఉదయం మొదలైన సందడి సాయంత్రానికి తగ్గుతుంది. కానీ దీపావళి వేళ మాత్రం సాయంత్రం అయ్యేకొద్దీ వేడుకల స్థాయి పెరుగుతుంటుంది. వంటింట్లో పిండివంటలు, ఇంట్లో దీపాలు, టపాకాయలు..వీటన్నింటి నుంచి కళ్లు జాగ్రత్త!
మిగతా ఏ పండగలైనా.. ఉదయం మొదలైన సందడి సాయంత్రానికి తగ్గుతుంది. కానీ దీపావళి వేళ మాత్రం సాయంత్రం అయ్యేకొద్దీ వేడుకల స్థాయి పెరుగుతుంటుంది. వంటింట్లో పిండివంటలు, ఇంట్లో దీపాలు, టపాకాయలు..వీటన్నింటి నుంచి కళ్లు జాగ్రత్త!
దీపావళి అంటేనే మిఠాయిలు, బంధుమిత్రుల కలయిక. కాబట్టి వంటపని కాస్త ఎక్కువే. అసలే నూనెతో కూడిన విషయం. ఆ చిటపటలు సున్నితమైన కళ్లలో పడితే ప్రమాదం. కాస్త దూరం పాటించడం మర్చిపోవద్దు. ఇంటి నిండా వెలిగించిన దీపాలకు కాస్త తడి తగిలినా ఇదే ప్రమాదం. చాలామందికి ఎలక్ట్రిక్ దీపాలతో ఇంటిని అలంకరించే అలవాటు ఉంటుంది. వైర్లు ఏమాత్రం సరిగా లేకపోయినా, సమస్య ఎదురైనా వాటి నుంచి రవ్వల్లా రాలిపడుతుంటాయి. వాటినీ ముందుగానే గమనించుకోవాలి. టపాసులు కాల్చేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒంటి మీద పడితే చికిత్స సులువే కానీ.. కళ్లలో పడితే చూపునే కోల్పోయే ప్రమాదముంది. ఇక పిల్లలూ ఉంటే.. మరింత జాగ్రత్తగా
ఉండాలి. కాబట్టి..
* కళ్లకు తప్పనిసరిగా గ్లాసెస్ ధరించండి, పిల్నల్నీ పెట్టుకోమనండి. ఒక్కోసారి టపాసుల నుంచి రవ్వలూ, రేణువుల్లాంటివి ఎగిరిపడుతుంటాయి. వాటి నుంచి ఇవి రక్షిస్తాయి. టపాసులను వెలిగించేటపుడు దూరం పాటించండి. విసిరేయడం వంటివి చేయొద్దని పిల్లలకు ముందుగానే చెప్పాలి. పక్కనే చల్లటి నీటితో బకెట్‌ను ఉంచడం మంచిది.
* కళ్లలో ఏదైనా పడ్డట్లుగా అనిపిస్తే.. కళ్లను మంచి నీటితో శుభ్రం చేయాలి. పోలేదనిపిస్తే చేతి నిండుగా నీటిని తీసుకుని కన్ను తెరిచి మరీ కొంతసేపు ఉంచాలి. ఉపశమనం కలిగినా వైద్యుణ్ని సంప్రదించడం తప్పనిసరి. గాయం తగలడం, రక్తం వంటివి కనిపిస్తే మంచినీటితో కడిగి, మెత్తటి వస్త్రంతో మృదువుగా పట్టిఉంచి, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!