close
Published : 04/12/2021 01:10 IST

భారీ ఫర్నీచర్‌..సులువుగా జరపొచ్చు!


చదువులు, ఉద్యోగం, ఉపాధి... కారణమేదైనా అప్పుడప్పుడూ ఇల్లు మారాల్సి వస్తుంది. సొంత ఇల్లైనా ఒక్కో సారి సామాన్లను అటూ ఇటూ మారుస్తుంటాం. చిన్నవి సరే కానీ భారీ వస్తువులకు ఎవరో ఒకరి సాయం అవసరం. ప్రతి సారీ ఎవరిని అడుగుతాం. అందుకు పరిష్కారం... ఈ పరికరం. దీంతో పని సులువవుతుంది. ‘హెవీ ఫర్నిచర్‌ లిఫ్టర్‌ అండ్‌ మూవర్‌’గా పిలిచే దీనిలో నాలుగు ఫ్లెక్సిబుల్‌ మూవర్‌ స్లైడర్స్‌ ఉంటాయి. వీటికి అడుగున చిన్న చక్రాలుంటాయి. ఇవి దాదాపుగా 150 కిలోల బరువును మోయగలవు. వీటిపై ఉండే రబ్బర్‌ ఫర్నిచర్‌ జారిపోకుండా చేస్తుంది. మరి ఎత్తడమెలా? అంటే.. అందుకు పొడవాటి లిఫ్టర్‌ (రాడ్‌ లాంటిది) వస్తుంది. దీని సాయంతో భారీ వస్తువులను సులువుగా రెండు అంగుళాల వరకు పెకెత్తవచ్చు. తర్వాత స్లైడర్స్‌ను అమర్చి కోరిన చోటికి తేలిగ్గా జరపొచ్చు. నచ్చిందా? అయితే ఈకామర్స్‌ సైట్లలో వెతికేయండి మరి!


Advertisement

Tags :

మరిన్ని