అద్దానికీ అందం

లైట్లతో... గదిని బట్టి అద్దాన్ని అమర్చుకోవాలి. నిలువుటద్దం ఉంటే దాని ఫ్రేం చుట్టూ రంగురంగుల లేదా ఒకే వర్ణంలో ఉండే సీరియల్‌ లైట్లను అమర్చుకోవాలి. పగలైనా, రాత్రి అయినా ఆ లైట్ల వెలుతురులో

Updated : 19 Dec 2021 06:02 IST

మేకప్‌ వేసుకునేటప్పుడు, బయటికి వెళ్లే ముందే కాదు... అద్దం కనిపిస్తేనే ఓ నిమిషం అక్కడే నిలబడిపోతాం. మన జీవితాల్లో అంతటి ప్రాముఖ్యత ఉన్న అద్దాన్నీ అందంగా అలంకరించొచ్చంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు.

* లైట్లతో... గదిని బట్టి అద్దాన్ని అమర్చుకోవాలి. నిలువుటద్దం ఉంటే దాని ఫ్రేం చుట్టూ రంగురంగుల లేదా ఒకే వర్ణంలో ఉండే సీరియల్‌ లైట్లను అమర్చుకోవాలి. పగలైనా, రాత్రి అయినా ఆ లైట్ల వెలుతురులో మన రూపం మరింత అందంగా కనిపిస్తుంది. బల్బులు కాస్త పెద్దవైనా బాగుంటాయి. చుట్టూతా బల్బులతో అద్దం ఉంటే గదిలో దాని ప్రత్యేకతా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.


* మనీప్లాంట్‌... అద్దం అలంకరణలో ఇండోర్‌ ప్లాంట్స్‌ను కూడా వినియోగించొచ్చు. ఎలాగంటే అద్దానికి చుట్టూ మనీప్లాంట్‌ను అల్లిస్తే చాలు. లేదా ఇండోర్‌ ప్లాంట్స్‌ తొట్టెలను అద్దానికి కింద ఇరువైపులా సర్దిచూడండి. ఆ మొక్కల ప్రతిబింబం అద్దంలో పడుతూ... ముచ్చటగా అనిపిస్తుంది. చిన్నచిన్నగా గుండ్రని అద్దాలను గోడకు తగిలించుకుంటే మాత్రం దానికి పక్కగా హ్యాంగింగ్‌ ప్లాంట్‌ అమర్చుకుంటే చాలు.


* ఫొటోలతో... పెద్ద, చిన్న.. ఏ పరిమాణంలో అద్దమైనా దాని చుట్టూ ఇంటిల్లిపాది కలిసి ఉన్న ఫొటో ఫ్రేములు లేదా స్నేహితులు, బంధువులు, మనకిష్టమైన వారి ఫొటోలను అమర్చుకుంటే చాలు. ఈ ఫొటో ఫ్రేములు అటు గదికి, ఇటు అద్దానికి కూడా కొత్త అందాన్ని తెస్తాయి. అలాగే చాలా ఫొటోలను సర్దిన పెద్ద ఫ్రేములో మధ్యన అద్దాన్ని బిగించి చూడండి. ఇక దాని ముందు నిలుచుంటే సమయమే తెలియదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్