ఇల్లు ఇంద్రధనుస్సులా...
ఆకాశంలో విరిసే సప్తవర్ణాల హరివిల్లు మనసుకెంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. చిరుజల్లుల మధ్య మెరిసే ఆ ఇంద్ర ధనుస్సులా ప్రతి గదినీ తీర్చిదిద్దుకుంటే ఇల్లంతా రంగులమయమై... హృదయాన్నంతా ఉత్సాహంతో నింపుతుంది. ఎనలేని సంతోషాన్నీ... మోసుకొచ్చేలా చేసే ఈ అలంకరణనెలా చేయాలో చూద్దాం.
ఆకాశంలో విరిసే సప్తవర్ణాల హరివిల్లు మనసుకెంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. చిరుజల్లుల మధ్య మెరిసే ఆ ఇంద్ర ధనుస్సులా ప్రతి గదినీ తీర్చిదిద్దుకుంటే ఇల్లంతా రంగులమయమై... హృదయాన్నంతా ఉత్సాహంతో నింపుతుంది. ఎనలేని సంతోషాన్నీ... మోసుకొచ్చేలా చేసే ఈ అలంకరణనెలా చేయాలో చూద్దాం.
హాల్లో... ఈ గది అలంకరణలో పూర్తిగా స్వేచ్ఛ తీసుకోవచ్చు. గోడలకు వర్ణభరితమైన పూల చిత్ర లేఖనాల ఫ్రేమ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే సోఫా కవర్ల నుంచి అందులో వేసే మెత్తని దిండ్లకు ఆరేడు రంగులు కలిసేలా కవర్లను వేయాలి. టేబుల్‌పై ఉండే మొక్కల కుండీ లేదా పూలకూజాపై రెండు మూడు వర్ణాలుండాలి. కార్పెట్‌లో ఎన్ని రంగులుంటే గది అంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. టేబుల్‌పై వేసే కవరు కూడా వర్ణభరితమైన డిజైన్ ఉండేది ఎంచుకుంటే బాగుంటుంది. అలాగే బాల్కనీనీ మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. చామంతులు, బంతులు, గులాబీల మొక్కలను పెంచితే ఆ పూలన్నీ ఇంద్రధనుస్సులానే అనిపిస్తాయి. ఆ తొట్టెలకు వేసే రంగులు కూడా ముదురుగా ఉండాలి. కుర్చీలు లేదా చిన్న సోఫాలాంటిది వేసి అందులో దిండ్లకు కవర్లు కూడా ముదురువర్ణంలో మెరవాలి. వీటితోపాటు బాల్కనీలో ఏర్పాటు చేసే లైట్లు కూడా పసుపు, నీలి, ఎరుపు వర్ణంలో వెలిగేలా ఉంటే మరో కొత్త ప్రపంచంలా అనిపించి సేద తీరుస్తుంది.
పడకగదిని.. గది హరివిల్లులా మారాలంటే అక్కడి సామాన్లన్నీ ముదురువర్ణాల్లో మెరిసి పోవాలి. పడకగదిలో మంచంపై వేసే దుప్పటి నుంచి తలగడల కవర్ల వరకు ఎరుపు, నీలి, ఊదా, నారింజ వర్ణాలన్నీ కలబోతగా ఎంపిక చేసుకోవాలి. గోడకు తగిలించే ఫ్రేమ్‌లోనూ ఇంద్రధనుస్సు డిజైన్ ఉంటే చాలు. ఆ గదికి వేరే ఆకర్షణ అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!