ఏం కొనాలి.. ఏం కొన్నారు
close
Published : 18/01/2022 01:05 IST

ఏం కొనాలి.. ఏం కొన్నారు

సరకుల కోసం మీ వారు సూపర్‌ బజార్‌కి వెళ్లారు. రాసినవన్నీ తీసుకున్నారా లేదా అన్న ఆలోచన మీ మనసులో. ఓ యాప్‌తో ఈ సమస్యను దూరం చేయొచ్చు. అదే ‘గూగుల్‌ కీప్‌’.

ఈ యాప్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దాన్ని తెరిచి అవసరమైన అనుమతులు, వివరాలు ఇవ్వండి. తర్వాత ప్లస్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేసి కొత్త నోట్‌ తెరవండి. అందులో దిగువ ఎడమ వైపున ఉన్న ప్లస్‌ గుర్తును క్లిక్‌ చేస్తే టిక్‌ బాక్సులు అని వస్తుంది. దాన్ని ఎంచుకుంటే టిక్‌లు పెట్టగలిగేలా ఓ జాబితా సిద్ధం అవుతుంది. అందులో కొనాలనుకుంటున్న వస్తువుల జాబితా రాసుకోండి.
అలా సిద్ధమైన నోట్‌కు కింద కుడివైపు ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ క్లిక్‌ చేస్తే కొలాబరేటర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి ఆ నోట్‌ షేర్‌ చేయాలనుకుంటున్న వారి మెయిల్‌ ఐడీ ఇవ్వండి. అప్పుడు అవతలి వ్యక్తి గూగుల్‌ కీప్‌ యాప్‌లో నోట్‌ కనిపిస్తుంది. అప్పుడు ఇద్దరూ ఒకేసారి ఆ పేజీని వాడొచ్చు. ఏయే వస్తువులు కొనాలో రియల్‌టైమ్‌లో అక్కడ నమోదు చేయొచ్చు. కొన్న వస్తువుల పక్కన బాక్సులో టిక్‌ చేస్తే... అది కింద పూర్తయిన జాబితాలో చేరిపోతుంది.
దీని వల్ల మీరు కొనాలనుకున్నవి, మీ వారు కొన్నవీ వివరాలు రియల్‌ టైమ్‌లో మీకు తెలిసిపోతాయి. అవసరం లేని వస్తువులు కొనడాన్ని కూడా నివారించవచ్చు.


Advertisement

మరిన్ని