కడగొచ్చు.. కోయొచ్చు
close
Published : 24/01/2022 00:11 IST

కడగొచ్చు.. కోయొచ్చు

క్కో కూరగాయను ఒక్కోరకంగా వండుతాం. తగ్గట్టుగా కోసే ముక్కల విషయంలోనూ మార్పులుంటాయి. అలాంటప్పుడు ఒక్క కటర్‌ ఏం సరిపోతుంది? ఈ మల్టీ ఫంక్షనల్‌ వెజిటబుల్‌ కటర్‌ను తెచ్చేసుకోండి. ఎంచుకున్నదాన్ని బట్టి 9-12 రకాలుగా తురమడం, తరగడం చేస్తుంది. అవసరానికి అనుగుణంగా బ్లేడ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. కోసుకునేటప్పుడు జారిపోకుండా హ్యాండిల్‌ సౌకర్యం ఉంటుంది. లోపల కింద చిల్లులతో మరో గిన్నె ఉంటుంది. దానిలో వేసి కడిగితే నీళ్లు దానంతటవే కిందకు వెళ్లిపోతాయి. కావాలంటే బయటకు తీసుకునే వెసులుబాటూ ఉంది. దానిలో ఉంచి కడగాలనుకుంటే కాస్త పక్కకు వంచితే సరి. ప్రత్యేక అమరిక కారణంగా ముక్కలూ పడిపోవు. మీరూ ఇలాంటి దానికోసమే చూస్తున్నారా? ఇంకేం తెచ్చేసుకోండి మరి. ఈకామర్స్‌ వేదికల్లో దొరుకుతోంది. శుభ్రం చేసుకోవడమూ తేలికే.


Advertisement

మరిన్ని