నల్లని వలయాలకు టీ బ్యాగులు..

కంటి కింద ఏర్పడే నల్లని వలయాలు, మచ్చలు వృద్ధాప్య ఛాయలను తలపిస్తాయి. అంతేకాదు, ఎంత మేకప్‌ వేసుకున్నా అవి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. వీటిని శాశ్వతంగా మాయం చేయడానికి టీ బ్యాగులు ఔషధాలుగా పని చేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు.

Updated : 12 Feb 2022 04:23 IST

కంటి కింద ఏర్పడే నల్లని వలయాలు, మచ్చలు వృద్ధాప్య ఛాయలను తలపిస్తాయి. అంతేకాదు, ఎంత మేకప్‌ వేసుకున్నా అవి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. వీటిని శాశ్వతంగా మాయం చేయడానికి టీ బ్యాగులు ఔషధాలుగా పని చేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు.

రెండు టీబ్యాగులను పది నిమిషాలు వేడినీటిలో నాననిచ్చి ఫ్రిజ్‌లో 20 నిమిషాలు ఉంచాలి. వీటిని కళ్లపై పావుగంట ఉంచి తీసేయాలి. ఆ తర్వాత కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసి 20 నిమిషాలు కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి. టీలో ఉండే కెఫిన్‌ యాంటీఆక్సిడెంట్స్‌ కంటికింద రక్తప్రసరణను బాగా జరిగేలా చేస్తాయి. దాంతో అక్కడి చర్మం మృదువుగా మారుతుంది. నల్లని వలయాలు, మచ్చలు, కంటికింద వాపు వంటివి క్రమేపీ దూరమవుతాయి. నిద్రలేమి కారణంగా ఏర్పడే ఈ నల్లని వలయాలు తిరిగి రాకుండా ఉండాలంటే రోజుకి ఎనిమిది గంటల నిద్ర, నాలుగైదు లీటర్ల మంచినీటిని తాగడం అలవరుచుకోవాలి.

సహజసిద్ధంగా...

కీరదోసను పలుచని చక్రాల్లా కోసి అరగంట ఫ్రిజ్‌లో పెట్టండి. వాటిని కంటిపై పది నిమిషాలుంచి తీసేసి కళ్లను చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే చాలు. నల్లని వలయాలు దూరమవుతాయి. టొమాటో, నారింజ రసం లేదా పుదీనా ఆకుల పేస్ట్‌ను కంటి కింద రాసి ఆరనిచ్చి కడిగినా చాలు. బంగాళాదుంప రసాన్ని రాసి ఆరనిచ్చి శుభ్రం చేసినా ఫలితం కనిపిస్తుంది. ప్రస్తుతం అండర్‌ ఐ క్రీమ్స్‌ లభ్యమవుతున్నాయి. రసాయన రహితమైనవి ఎంచుకోండి. సి విటమిన్‌, రెటినాయిడ్స్‌ ఉండే వాటిని ఎంపిక చేసుకుంటే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. ఏదైనా ఎస్సెన్షియల్‌ నూనెను రాత్రి నిద్రపోయే ముందు కంటిచుట్టూ మృదువుగా మర్దన చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్