Published : 21/02/2022 01:28 IST

రుచుల పొడులు కావాలా!

వంట చేయడానికి కూరగాయలు ఎంత అవసరమో అందులో వేసే దినుసులు, పొడులూ అంతే ముఖ్యం. ముఖ్యంగా మసాలా పొడుల ప్రాముఖ్యం చాలా ఎక్కువ. వీటితోనే కూర రుచి పెరుగుతుంది. మరి అంతటి రుచుల పొడులు మీ వంట గదిలో ఉన్నాయా.

దాల్చినచెక్క పొడి... నాన్‌వెజ్‌ కూరల్లో మసాలాలతో కలిపి దీన్ని వాడతారు.  ప్రత్యేకంగా స్వీట్లు, పెరుగులో వేసుకుంటారు. వంటకాలకు మరింత తియ్యదనం కావాలంటే దీన్ని చేర్చుకుంటే సరి.

బిర్యానీ ఆకులు... వీటిని అన్ని శాకాహార, మాంసాహార వంటకాల్లో, సూపుల్లో వేసుకోవచ్చు. అయితే పరిమితంగా వాడుకోవాలి. ఎక్కువ వేస్తే చేదవుతుంది.

నట్‌మగ్‌ పొడి... జాజికాయ గింజలను మెత్తగా నూరి ఈ పొడి తయారుచేస్తారు. ఏదైనా వంటకానికి తీపిని జోడించే మసాలా. తక్కువ మోతాదులోనే వాడాలి సుమా.

జీలకర్ర పొడి... వేయించిన జీలకర్ర పొడి వంటల్లో వాడుకోవాలి. ఇది కూరకు ఘాటును, రుచిని అందిస్తుంది. రైతా, చాట్‌లలోనూ వేసుకోవచ్చు. కాసింత జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

ధనియాల పొడి... ఇది లేనిదే చాలా మంది కూర వండరు. కొత్తిమీరకు ప్రత్యామ్నాయంగా వాడుకునే ఇది రుచితోపాటు మంచి వాసనను ఇస్తుంది.

కూర కారం... ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, సెనగపప్పు, చింతపండు,  ఎండుమిర్చీ, వెల్లుల్లిని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ కారాన్ని కూరల్లో వేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది. కారాన్ని పక్కన పెట్టేయండి మరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని