వంటింట్లో పని తగ్గాలంటే...
మనలో చాలామందికి ఎక్కువ సమయం వంటింట్లోనే గడిచి పోతుంటుంది. నిజానికి వంటకు అంతసేపు పట్టదు. ఎందుకు తెమలదంటే.. కడగటం, తుడవటం, సామాన్లు దొరికించుకోవడం లాంటి పనులతోనే సమయం వృథా అయిపోతూ ఉంటుంది. అలా కాక పని తగ్గాలంటే...
మనలో చాలామందికి ఎక్కువ సమయం వంటింట్లోనే గడిచి పోతుంటుంది. నిజానికి వంటకు అంతసేపు పట్టదు. ఎందుకు తెమలదంటే.. కడగటం, తుడవటం, సామాన్లు దొరికించుకోవడం లాంటి పనులతోనే సమయం వృథా అయిపోతూ ఉంటుంది. అలా కాక పని తగ్గాలంటే...
* వంటింట్లో పాత్రలు పద్ధతి, వరుసక్రమం లేకుండా పెట్టినా, ఒక దాని మీద ఒకటి పేర్చినా అవసరమైనప్పుడు తీసుకోవడం కష్టం. సామాను పెట్టుకునే అల్మరలో తక్కువ ఎత్తులో అనేక అరలు ఉండేలా చేయించుకుంటే ప్రతి వస్తువూ విడివిడిగా అమర్చుకోవచ్చు. దీనివల్ల తీసుకోవడమూ ఆనక సర్దేయడమూ సులువే.
* పొయ్యి గట్టు కింది స్థలం వృథా కాకుండా సొరుగులు చేయించుకోవడం తెలిసిందే. అందులోనూ అనేక అరలు పెట్టిస్తే గ్లాసులూ చెంచాలూ చిన్న చిన్న గిన్నెలు లాంటివన్నీ ఎక్కడివక్కడ అమర్చుకోవచ్చు. పొయ్యికి దగ్గరగా ఉండే సొరుగులో పోపు గింజలు, దినుసులు మొదలైన చిన్న డబ్బాలన్నీ ఉంచేలానూ డిజైన్ చేస్తున్నారు. పూర్వంలా పోపుల డబ్బా అవసరం లేదు.
* పాట్ రెయిల్ ఏర్పాటు చేసుకుంటే తాలింపు వేసే చిన్ని మూకుడు, దోశల నాన్‌స్టిక్ ప్యాన్, టీ కాచే హ్యాండిల్ గిన్నె లాంటివన్నీ తగిలించుకోవచ్చు. ఈ కడ్డీ హార్డ్‌వేర్ దుకాణంలో లేదా రాగి సామాన్ల కొట్టులో దొరుకుతుంది. మీ వంటింట్లో అలా వీలు కాదనుకుంటే సొరుగుల పక్కన మేకులు కొట్టించి హ్యాండిల్ ఉన్న పాత్రలను తగిలించవచ్చు. వీటిని అరల్లో పెడితే హ్యాండిల్ అడ్డొస్తుంది కనుక చూపులకు బాగుండదు, ఎక్కువ పాత్రలు పట్టవు.
* స్క్రబ్బర్లు, బ్రష్షులు లాంటి క్లీనింగ్ సామాన్లు ఎదురుగా ఉంటే స్థలం ఆక్రమిస్తాయి, చూడ్డానికీ బావుండదు. వాటికి క్యాబినెట్ పక్కన స్థలంలో చిన్న ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేసుకుంటే అడ్డంగా ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!