కొత్త రుచులు కనిపెట్టారు!
మనలో చాలామందికి ఉదయం కాఫీతోనే రోజు మొదలవుతుంది. వేడివేడి పొగలుకక్కే చిక్కటి కాఫీ గొంతులో దిగితే ఎక్కడలేని హుషారూ వస్తుంది.
మనలో చాలామందికి ఉదయం కాఫీతోనే రోజు మొదలవుతుంది. వేడివేడి పొగలుకక్కే చిక్కటి కాఫీ గొంతులో దిగితే ఎక్కడలేని హుషారూ వస్తుంది.
ఇప్పుడంటే ఇన్స్టంట్ కాఫీలు చేసుకుంటున్నాం కానీ... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ కాఫీనే తాగుతారు. అయితే ఈ కాఫీ ఫిల్టర్‌ని ఓ మహిళ తయారుచేసిందనే విషయం తెలుసా...
మెలిటా బెంజ్ అనే జర్మనీ మహిళ కాఫీ ఫిల్టర్‌ను కనుక్కుంది. ఆ రోజుల్లో కాఫీ చాలా చేదుగా ఉండేదట. మెలిటా తన భర్త కోసం రోజూ కాఫీ తయారుచేసేవారు. అయితే ఆ చేదు కాఫీ ఆమెకు నచ్చేది కాదు.. దాని రుచి మారిస్తే ఎలా ఉంటుందని అనుకున్నారామె. అందుకోసం ఓ ప్రయోగం చేశారు. ఇత్తడి డబ్బాకు అడుగున మేకుతో రంధ్రాలు చేశారు. తన కొడుకు పుస్తకం నుంచి కొన్ని బ్లాంటింగ్ కాగితాలను చింపి వాటిని రంధ్రాలున్న డబ్బా కింద పెట్టారు. ఈ మొత్తం సెట్‌ను కాఫీ కప్పు మీద పెట్టారు. పైన ఇత్తడి డబ్బాలో పోసిన కాఫీ నీళ్లు మెల్లిమెల్లిగా కింది కప్పులోకి వచ్చి చేరాయి. ఇవి ఇంతకు ముందు కాఫీలా చేదుగా కాకుండా రుచిగా మారాయి. ఈమె తయారుచేసిన విధానానికి ‘పేపర్ కాఫీ ఫిల్టర్ బ్రూయింగ్ సిస్టమ్’ అని పేరు. దీనికి సంబంధించిన పేటెంట్నూ ఆమె అందుకున్నారు. సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించారు. పెట్టిన కొన్నాళ్లలోనే దాదాపు 1200 కాఫీ ఫిల్టర్లను విక్రయించారు... ఆ తర్వాత బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. ఆమె వారసులు ఇప్పటికీ 50 దేశాల్లో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
మొదటి సారి ఐస్‌క్రీమ్...
పూర్వం రోజుల్లో ఐస్‌క్రీమ్ తయారీకి చాలా శ్రమ పడాల్సి వచ్చేది. అంతే కాదు ఎక్కువ సమయమూ పట్టేది. అలాంటి కాలంలో అమెరికాకు చెందిన నాన్సీ మరియా డొనాల్డ్సన్ జాన్సన్ ఐస్‌క్రీమ్ మేకర్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం 1843లో పేటెంట్నూ పొందారు. చేత్తో పనిచేసే ఈ పరికరం ఐస్‌క్రీమ్‌ను చాలా మృదువుగా తయారుచేస్తుంది. ఈ ఆవిష్కరణ ముందు ఐస్‌క్రీమ్ అంటే కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే తినే ఒక అమోఘమైన పదార్థం అనుకునేవారు. ఈమె తయారుచేసిన మెషీన్ వచ్చాక అమెరికాలోని అన్ని వర్గాలవారికి అందుబాటులోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!