ఏంటీ... చేపల కూరా!
ఆదివారమో, సెలవు రోజో లేదా చుట్టాలొచ్చినప్పుడో ప్రత్యేక వంటలు వండటం మనకు అలవాటే. అందునా నాన్‌వెజ్‌కు ప్రాధాన్యమిస్తాం. చికెన్, మటన్లతోపాటు చేపలూ వంటల్లో చేరతాయి. అందుకే వీటిని వండేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...
ఆదివారమో, సెలవు రోజో లేదా చుట్టాలొచ్చినప్పుడో ప్రత్యేక వంటలు వండటం మనకు అలవాటే. అందునా నాన్‌వెజ్‌కు ప్రాధాన్యమిస్తాం. చికెన్, మటన్లతోపాటు చేపలూ వంటల్లో చేరతాయి. అందుకే వీటిని వండేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...
తాజా చేపలు.. చేపల కూర రుచి వాటి తాజా దనంపై ఆధార పడుతుంది. చాలా కాలంపాటు నిల్వ చేసినవి వండితే వాటి రుచి అంతగా బాగోదు. కాబట్టి తాజావి చూసి తీసుకోండి. వాటి కళ్లు మెరుస్తూ ఉన్నా, మొప్పలు ఎరుపు - గులాబీ రంగులో ఉన్నా అవి తాజావే అని అర్థం. అలాగే చేపల్లోని చిన్న ముళ్లను శుభ్రం చేసి ఇమ్మనండి.
ఎక్కువసేపు వద్దు... చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇది. చేపలను ఎక్కువసేపు మారినేట్ చేయకూడదు. కొంతమంది వీటిని గంటల తరబడి మారినేట్ చేస్తారు. చేప మాంసం చాలా మృదువుగా ఉంటుంది. అన్నేసి గంటలు అందులో ఉంటే రుచి పోతుంది. ఎంత సమయం నిల్వ చేయాలనేది చేపను బట్టి మారుతుంది. కొన్ని రెండు గంటలు నాన బెడితే మరి కొన్నింటికి అరగంట సరిపోతుంది.
తడి లేకుండా... వేపుడు, కూర, పులుసు... ఇలా రకరకాలుగా వండుతారు. వీటిని వేయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలను బాగా శుభ్రం చేసి నీరంతా పోయిన తర్వాతే మసాలాలు పట్టించాలి. ఎక్కువైన తేమను పేపర్ టవల్‌తో తుడిచేయాలి.
సరైన పాత్ర... చేప ముక్కలు విరగకుండా కూర బాగా వండాలంటే పాత్ర పెద్దగా, వెడల్పుగా ఉండేది ఎంచుకోవాలి. చేపల కూరకి మార్కెట్లో ప్రత్యేక పాత్రలు దొరుకుతాయి. చేపలను వేయించడానికి, కలపడానికి కూడా ప్రత్యేక గరిటెలు ఉంటాయి. వాటిని ఎంచుకుంటే సరి. ఇవి కాస్త మందంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండి చేప ముక్కలను తిరగేయడానికి చక్కగా ఉపయోగపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!