చర్మాన్ని బట్టి గోళ్లరంగు

అఖిల తన స్నేహితురాలు వేసుకొనే గోళ్ల రంగులనే తానూ ఎంచుకుంటుంది. కానీ అవి తన చేతికి ఎందుకు అందంగా లేవో అర్థంకాదామెకు. ఇవి ఎంచుకునేటప్పుడు దుస్తులకు మ్యాచింగ్‌గా కాకుండా చర్మవర్ణానికి తగినట్లు చూసు కోవాలంటున్నారు నిపుణులు..

Updated : 08 Apr 2022 17:10 IST

అఖిల తన స్నేహితురాలు వేసుకొనే గోళ్ల రంగులనే తానూ ఎంచుకుంటుంది. కానీ అవి తన చేతికి ఎందుకు అందంగా లేవో అర్థంకాదామెకు. ఇవి ఎంచుకునేటప్పుడు దుస్తులకు మ్యాచింగ్‌గా కాకుండా చర్మవర్ణానికి తగినట్లు చూసు కోవాలంటున్నారు నిపుణులు..

చామన ఛాయకు.. ఈ వర్ణం వారికి గోల్డ్‌, రస్ట్‌ రంగులు తప్ప ఏదైనా ఇట్టే నప్పుతాయి. ఆలివ్‌, రాగి కూడా అందంగా కనిపిస్తాయి. తేనె, నీలం, ఊదా, గులాబీతో పాటు లేతవర్ణాలన్నీ బాగుంటాయి. ఎరుపు, నారింజ కలగలిపినట్లుగా ఉండే పగడం రంగు కూడా ఎంచుకోవచ్చు.

నలుపు వర్ణం వారికి.. ఎరుపు రంగుపై తెల్లని షేడ్స్‌ డిజైన్‌ వీరి గోళ్లకు అందంగా కనిపిస్తుంది. నారింజ, ఎరుపు, నియాన్‌ గ్రీన్‌ వంటి రంగులు ఈ వర్ణం వారికి బాగా నప్పుతాయి. గోళ్లకు ఈ రంగులు వేస్తే చేతివేళ్లను ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. నీలం, ఆకుపచ్చ కలిపినట్లుగా ఉండే మింట్‌ వర్ణం వీరి చేతులపై మ్యాజిక్‌ చేస్తుంది.

తెలుపు, ఎరుపు ఛాయకు.. లేత పసుపు, లేత గులాబీ, లేత నారింజ, ఊదా వంటి వర్ణాలన్నీ సరిపోతాయి. ముదురు వర్ణాలను బేస్‌గా వేసి వాటిపై లేతవర్ణాలను అద్దినా గోళ్లు అందాన్ని సంతరించుకుంటాయి. కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. అంతేకాదు, రెడ్‌-ఆరెంజ్‌ వర్ణాన్ని యాంటీ ఏజింగ్‌ కలర్‌ అంటారు. కాస్త పెద్ద వయసు వారు కూడా శరీర ఛాయతో సంబంధం లేకుండా దీన్ని వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్