Updated : 11/04/2022 01:58 IST

అల్మారా నిండిందా? అతిగా కొన్నారేమో!

‘ఈ డ్రెస్‌ మొన్నే వేసుకున్నా.. మళ్లీ ఈ వేడుకకి వేసుకోవడమెలా?’, ‘మంచి ఆఫర్‌.. కొనకపోతే మళ్లీ అయిపోతుంది’, ‘అరె.. ఇదిప్పుడు ఫ్యాషన్‌. నా దగ్గర లేకపోతే చిన్నచూపు కదూ’.. మన వార్డ్‌రోబ్‌లోకి కొత్త దుస్తులు చేరడానికి ఇలాంటి కారణాలెన్నో. కానీ ఇవి స్థలాన్నే కాదు.. డబ్బునూ మింగేస్తాయన్న సంగతి గమనించారా? ఈ తీరు మార్చుకోవాలనుకుంటే పాటించేయండివి.

* వెనకబడతామనుకోవడం, పక్కవారు చిన్నచూపు చూస్తారనుకోవడం, అవసరానికి మించిన కొనుగోళ్లకి కారణాలని నిపుణుల భావన. ముందు వాటిని పక్కన పెట్టేయండి. మీ దగ్గరున్న దుస్తులన్నింటినీ వేడుకల్లోనూ, రోజువారీగా  వేసుకునేవిగా విభజించి పక్కన పెట్టండి. ఉతికిన తర్వాత వాటిని అడుగున పెట్టేయండి. వెంటనే వేసుకున్నామనే, తక్కువగా ఉన్నాయనే భావనా కలగదు.
* ఆఫర్‌లో వస్తోందంటే డబ్బు ఆదా అవుతుంది నిజమే. ఎప్పుడో ఓసారి కొంటే ఆదా కానీ.. తరచూ కొంటోంటే అనవసరంగా కొంటున్నట్లేగా! కాబట్టి, తప్పనిసరి వేడుక, పండగలు మినహా కొనొద్దని మీకు మీరే షరతు విధించుకోండి.
* మిమ్మల్ని కొనేలా ఆకర్షిస్తున్న యాప్‌లు, సైట్‌లకు దూరంగా ఉండండి. నోటిఫికేషన్లు రాకుండా ఆపే యాప్‌లూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తరచూ వాడని వీటిని వాటికి జత చేస్తే చాలు. ఆఫర్ల ఆకర్షణలకు తాళం పడుతుంది.
* ఏదైనా కొనేప్పుడు ఇది నిజంగానే వాడతామా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వెంటనే కొనేయక కొంత సమయం దాన్నుంచి దూరంగా వెళ్లండి. చివరి వరకూ అవసరం అనిపిస్తేనే కొనండి. అప్పుడు వృథా ఉండదు.
* కొన్ని డ్రెస్‌లు రోజులు, నెలల తరబడి అల్మారాలో పడి ఉంటాయి. తీద్దామంటే మనసొప్పదు. అలాగని వేసుకోం. గత రెండు, మూడు నెలల్లో ఎన్నిసార్లు వేశారన్నది బేరీజు వేసుకోండి. ఒక్కసారీ వేయబుద్దవలేదూ.. వేరే వారికి ఇచ్చేయండి. స్థలమూ లభిస్తుంది. ఇతరులకు సాయమూ చేసినవారవుతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని