చిన్నారుల బొమ్మలు కింది అరల్లో...
ఇల్లు ఎంత అందంగా ఉంటే మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. కనుకనే మనమంతా ఉన్నంతలో ఇంటిని చక్కగా సర్దుకోవడానికి, ప్రయత్నిస్తాం. ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తున్న ఈ చిన్న చిన్న సూత్రాలు పాటించి మీ ఇంటిని మరింత ముస్తాబు చేసుకోండి.
ఇల్లు ఎంత అందంగా ఉంటే మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. కనుకనే మనమంతా ఉన్నంతలో ఇంటిని చక్కగా సర్దుకోవడానికి, ప్రయత్నిస్తాం. ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తున్న ఈ చిన్న చిన్న సూత్రాలు పాటించి మీ ఇంటిని మరింత ముస్తాబు చేసుకోండి.
* ఇంటి అలంకరణలో అనేక పద్ధతులు చూసినప్పుడు మీ ఇల్లు ఎలా ఉండాలో మీకంటూ కొన్ని ఆలోచనలు, అంచనాలు ఏర్పడతాయి. అప్పుడు నచ్చిన పద్ధతిని అనుసరించండి. మీకు నచ్చని అంశాలేమిటో గుర్తించి దూరం పెట్టండి.
* గదుల నిడివికి తగిన వస్తువులనే ఎంచుకోండి. కాస్త కసరత్తు చేస్తే వాటిని పొందిగ్గా అమర్చుకోవడం తేలిక. పెద్ద సోఫాలు, టీపాయ్లూ విశాలమైన గదుల్లోనే అందాన్నిస్తాయి. మన హాలు చిన్నదైతే అలాంటివి ఎంచుకోకపోవడం ఉత్తమం. లేదంటే స్థలమంతా ఆక్రమిస్తాయి.. చూడ్డానికీ బాగుండదు.
* వస్తువులు అవసరాలు తీర్చే, శోభను పెంచే మాట నిజమే. అలాగని వాటితో కిక్కిరిస్తే ఇల్లు సంతను తలపిస్తుంది. గదుల్లో తగినంత ఖాళీ స్థలం ఉంటేనే అందం.
* రంగుల విషయంలో త్వర పడి నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ సభ్యులందరూ కలిసి రంగులను ఎంచుకోవాలి. ఏదైనా సందేహంగా అనిపిస్తే శాంపిల్‌గా కొంత మేరకు వేసి నచ్చితే మొత్తం వేయించాలి.
* కొన్ని కుర్చీలు ఆకర్షణీయంగా రూపొందిస్తారు. వాటిని చూసి ముచ్చటపడి కొనేస్తాం. తీరా కాసేపు కూర్చోగానే ఇబ్బందిగా తోస్తాయి. కనుక కొనేటప్పుడు వాటిలో సుఖంగా కూర్చోవడం వీలవుతుందా లేదా అనేది పరిశీలించాలి.
* చాలా మంది ముదురు ఎరుపు కార్పెట్ పరుస్తారు.. అందంతో బాటు త్వరగా మాయదని. అతిథులు ఇంటికి వస్తున్నప్పుడు కొంచెం భిన్నమైన రంగు కార్పెట్ పరవండి. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
* గోడల రంగులు అస్తమానం మార్చలేం. అయితే వాటికి దగ్గరగా ఉండే రంగుల్లో సోఫా కవర్లు, తలుపులూ కిటికీల కర్టెన్లూ మారుస్తూ ఉంటే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తాయి.
* ఖరీదైన సామగ్రి, పింగాణి వస్తువులు లాంటివి కప్బోర్డ్ పై సొరుగులో పెడితే పిల్లలకు అందకుండా పదిలంగా ఉంటాయి. పిల్లల బొమ్మలు కింది సొరుగులో పెట్టేయండి. పెద్దలకు సంబంధించినవి అందులో పెడితే వంగి తీసుకోవడం కష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!