అభిరుచికి అద్దం పట్టేలా...
ఇంటిని సర్దడం లేదా అలంకరించడం శ్రమ అనుకుంటారు చాలామంది. నిజానికి అందులో బోల్డంత ఆనందం ఉంది. ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుందాని ఆలోచిస్తూనో, బంధుమిత్రుల ఇళ్ల కంటే మనిల్లు బాగుండాలనే పోటీ తత్వంతోనో సర్దితే విసుగనిపించదు. ఇష్టం, ధ్యాసా ఉండాలేే గానీ ఆ పని సరదాగా సాగిపోతుంది....
ఇంటిని సర్దడం లేదా అలంకరించడం శ్రమ అనుకుంటారు చాలామంది. నిజానికి అందులో బోల్డంత ఆనందం ఉంది. ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుందాని ఆలోచిస్తూనో, బంధుమిత్రుల ఇళ్ల కంటే మనిల్లు బాగుండాలనే పోటీ తత్వంతోనో సర్దితే విసుగనిపించదు. ఇష్టం, ధ్యాసా ఉండాలేే గానీ ఆ పని సరదాగా సాగిపోతుంది.
* ముందుగా మీకెలా ఉంటే నచ్చుతుందో ఆలోచించండి. సంప్రదాయంగానా లేక అధునాతనంగానా? అత్యవసర వస్తువులతో ఇల్లంతా ఖాళీ ఖాళీగా ఉంటేనా లేక దేనికీ ఇబ్బంది పడకుండా అన్నీ అమరి ఉండాలా?- ఇలా ప్రతీ విషయంలో మీకంటూ స్పష్టత ఉంటే మొక్కుబడికీ మొహమాటానికీ తావీయకుండా ఆ రకంగానే ఇంటిని తీర్చిదిద్దుకోండి.
* కొందరికి కొండకోనలు నచ్చుతాయి. ఇంకొందరికి నదులూ సముద్రాలూ నచ్చుతాయి. వాటికి దగ్గర్లో నివాసం ఉండాలంటే సాధ్యం కాదు. కానీ పోస్టర్ లేదా పెయింటింగ్ రూపంలో వాటిని మనింట్లోకే తెచ్చేసుకోవచ్చు. అలాగని వాటిని శాశ్వతంగా గోడల మీద ఉంచేయకుండా అప్పుడప్పుడూ దాచేసి వేరేవి పెట్టి, కొన్నాళ్లకు మళ్లీ తగిలించండి. ఇంతేనా అనిపించకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం వస్తుంది.
* చాలా ఇళ్లలో ముందు వసారాలో, వెనుక భోజనాల గదిలో పెద్ద కిటికీలు ఉంటాయి కానీ పడగ్గదిలో మాత్రం గాలీ వెలుతురూ చొరబడే అవకాశం ఉండదు. ఓ చిన్న కిటికీ ఉన్నా, అది నిరంతరం మూసే ఉంటుంది. ఇలా మూసేసినట్లుండే గదులు అందంగా భాసించకపోవడమే కాదు, అనారోగ్య కారకాలు అంటున్నారు వైద్యులు. మనం పడుకునే గదిలో ఎంత పెద్ద కిటికీ ఉంటే అంత బాగుంటుంది. ఆ గదికి బాల్కనీ కనుక ఉంటే పగలంతా తలుపు తీసే ఉంచడం మంచిది. స్వచ్ఛమైన గాలి లోనికి రావడం వల్ల మనసూ, శరీరమూ ప్రశాంతంగా ఉంటాయి.
* మార్కెట్లో ఎప్పటికప్పుడు ఏవో కొత్త ట్రెండ్స్ నడుస్తుంటాయి. ‘ఇప్పుడీ వస్తువు హవా నడుస్తోంది, దీన్ని గుమ్మానికి తగిలించండి, కలిసొస్తుంది.. ఈ మొక్క పెంచి చూడండి, మీ దశ తిరిగిపోతుంది’ అంటూ అంటగట్టబోతారు. అలాంటివి మిమ్మల్ని చాదస్తపు మనుషుల కింద జమకట్టేలా చేస్తాయి. ఇంట్లో ప్రతిదీ మీ అభిరుచికి అద్దం పట్టేలా ఉండాలే తప్ప అభద్రతను చాటేలా ఉండకూడదని గుర్తుంచుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!