పాలు విరిగాయా... పారేయొద్దు!
వేసవిలో తరచూ పాలు విరిగి పోతుంటాయి. వీటితో ప్రతి సారీ పనీర్ లాంటిదే కాకుండా ఇతర వంటకాలనూ ప్రయత్నించొచ్చు.
వేసవిలో తరచూ పాలు విరిగి పోతుంటాయి. వీటితో ప్రతి సారీ పనీర్ లాంటిదే కాకుండా ఇతర వంటకాలనూ ప్రయత్నించొచ్చు.
రస్ మలై... విరిగిన పాలను వడకట్టి ఓసారి నీటితో కడగాలి. ఆ తర్వాత చిల్లుల గరిటెలో వేసి పావుగంట ఉంచాలి. అందులోని నీళ్లన్నీ పోతాయి. ఇప్పుడీ పాల మిశ్రమంలో చెంచా మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే రస్మలై ఉండలు అంత బాగా వస్తాయి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి కప్పు చక్కెరకు నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అది కరిగి చిక్కగా మారే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాకంలో ఉండలను వేసి పదిహేను నిమిషాలు మరిగించాలి. దాంతో ఉండల పరిమాణం రెండింతలవుతుంది.
రస్మలై జ్యూస్ కోసం... పాన్లో అర లీటరు చిక్కటి పాలు పోసి వేడి చేయాలి. పావు కప్పు పాలలో ఒకట్రెండు కుంకుమపువ్వు రేకలు వేసి పక్కన పెట్టాలి. పాలు మరిగే సమయంలో చక్కెర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రేకలు వేసి కలపాలి. చిన్న మంటపై ఓ పదినిమిషాలు మరిగించి కలుపుతూనే ఉండాలి.
పాలను ఓ 20-25 నిమిషాలు మరిగించాక బాగా చిక్కగా మారతాయి. ఇందులో యాలకుల పొడి, పిస్తాలను వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంలోని రస్మలై బాల్స్ తీసి చేత్తో అదిమి ఈ మరిగించిన చిక్కటి పాలలో వేయాలి. ఈ పాలు కాస్త గోరువెచ్చగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని అయిదారు గంటలు ఫ్రిజ్లో పెట్టాలి.
కలాకండ్... మూడు కప్పుల విరిగిన పాలను సన్నని నూలు వస్త్రంలో పోసి చెనాను తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి రెండు కప్పుల తాజా పాలను కాచాలి. దీంట్లో చెనాను వేసి బాగా కలపాలి. ఇవి కాస్త చిక్కగా అయ్యాక నెయ్యి, చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి రాసి దాని మీద సమానంగా పరవాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకృతిలో కట్ చేసుకుని బాదం/కాజుతో గార్నిష్ చేసుకుంటే సరి.
చూశారుగా... ఈసారి పాలు విరిగితే ఈ రెండు స్వీట్లూ ప్రయత్నించి చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!