ఇంటి అందాన్ని పెంచే కృత్రిమ వెదురు..

ఇంటి ముందుగదిలో పచ్చటి వెదురు పొద దగ్గర కూర్చుని వేడివేడి టీ తాగితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇంట్లో వెదురు ఏంటి.. అని అనుకోవద్దు. ఇటువంటి కలను తీర్చడానికి పొడవైన కృత్రిమ వెదురు చెట్లు, మొక్కలు లభ్యమవుతున్నాయి. ఇంటి అలంకరణలో ఇవీ.. ఓ భాగమవుతున్నాయి. 

Published : 28 May 2022 01:24 IST

ఇంటి ముందుగదిలో పచ్చటి వెదురు పొద దగ్గర కూర్చుని వేడివేడి టీ తాగితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇంట్లో వెదురు ఏంటి.. అని అనుకోవద్దు. ఇటువంటి కలను తీర్చడానికి పొడవైన కృత్రిమ వెదురు చెట్లు, మొక్కలు లభ్యమవుతున్నాయి. ఇంటి అలంకరణలో ఇవీ.. ఓ భాగమవుతున్నాయి. 

ముందుగదిని రెండుగా విభజించుకోవాలన్నప్పుడు మధ్యలో ఈ వెదురు మొక్కలను వినియోగిస్తే చాలు. ఇంట్లో పచ్చదనం నిండినట్లు అనిపిస్తుంది. గదికో ప్రత్యేకతా వస్తుంది. నీళ్ల అవసరం ఉండదు కాబట్టి చెమ్మ అవుతుందని అనుకోనక్కర్లేదు. సహజంగా కనిపించే వీటిని సోఫా, కాఫీ టేబుల్‌ పక్కన సర్దితే చాలు. ఉదయం, సాయంకాలం అక్కడ కూర్చుని వేడివేడి టీ తాగుతూ గార్డెన్‌లో ఉన్నట్లు భావించొచ్చు. అలాగే బాల్కనీకి ఓవైపు ఈ వెదురుచెట్లు అమర్చుకున్నా చాలు. మొత్తమంతా పరుచుకొని ఉన్న వీటి వద్ద కాసేపు సేద తీరినప్పుడు మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది.

ఎక్కడైనా.. పిల్లల గది, మెట్లపక్కగా, పడక గదిలో అంటూ ఎక్కడైనా వీటికి చోటివ్వొచ్చు. వరుసగా 50కిపైగా వెదురు కొమ్మలున్నవే కాకుండా కుండీల్లో ఉండే రకాలూ లభ్యమవుతున్నాయి. సింపుల్‌గా డ్రస్సింగ్‌ రూంలో అద్దం పక్కగా ఓ కుండీ మొక్కను సర్ది చూడండి. గదంతా ఆకర్షణీయంగా మారిపోతుంది. కుర్చీల మధ్య లేదా సోఫాకు పక్కగా సర్దినా చాలు. ప్రత్యేకంగా కనిపిస్తూ ఇంటికి కొత్త అందాన్ని మోసుకొస్తాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్