ఈ మరకలు క్షణాల్లో మాయం...

పిల్లల చేతిలో మార్కర్‌ ఉందంటే చాలు. ఇల్లంతా ఎక్కడికక్కడ ఆ రంగు అంటుకోవాల్సిందే. వాళ్ల దుస్తులపై మరకలా మారాల్సిందే. గోడలు, వైట్‌బోర్డు, కుర్చీలు, దుప్పట్లు వంటివాటిపై మార్కర్‌ ఇంకు...

Published : 30 May 2022 01:10 IST

పిల్లల చేతిలో మార్కర్‌ ఉందంటే చాలు. ఇల్లంతా ఎక్కడికక్కడ ఆ రంగు అంటుకోవాల్సిందే. వాళ్ల దుస్తులపై మరకలా మారాల్సిందే. గోడలు, వైట్‌బోర్డు, కుర్చీలు, దుప్పట్లు వంటివాటిపై మార్కర్‌ ఇంకు కొట్టొచ్చిన్నట్లు కనిపించేలా చేస్తే ఈ చిట్కాలతో మొండి మరకలను సైతం క్షణాల్లో మాయం చేయొచ్చు.

వైట్‌బోర్డుపై అంటిన మార్కర్‌ మరకలను వెంటనే ఎరేజర్‌ లేదా పేపర్‌ టవల్‌తో తుడిచేస్తే పోతాయి. సెరామిక్‌ గ్లాస్‌ పాత్రలపై ఉంటే టూత్‌పేస్ట్‌, వంటసోడాను సమపాళ్లలో కలిపిన మిశ్రమంతో మృదువుగా రుద్దితే చాలు. గాజు గ్లాసుపై మరకను పోగొట్టాలంటే నెయిల్‌పాలిష్‌ రిమూవర్‌ను కాస్తంత దానిపై వేసి మృదువైన వస్త్రంతో తుడిస్తే సరి. టైల్స్‌పై ఉన్నవాటిని హెయిర్‌ స్ప్రే చల్లి పేపర్‌ టవల్‌తో తుడవాలి. కార్పెట్లపై కనిపించే మార్కర్‌ మరకను మాయం చేయాలంటే ముందుగా ఒక స్ప్రే సీసాలో వెనిగర్‌ నింపి దాన్ని స్ప్రే చేస్తే మరక పోతుంది.

గోడలపై.. లేత వర్ణాలున్న గది గోడలపై మార్కర్‌ ఇంకు కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తుంది. పాత టూత్‌బ్రష్‌పై చిటికెడు టూత్‌పేస్ట్‌ వేసి మరక ఉన్నచోట మృదువుగా రుద్దితే చాలు. చెక్క, లెదర్‌ వస్తువులపైన మరక ఉంటే ముందుగా మెత్తని కాటన్‌ వస్త్రం తీసుకొని దానిపై మూడునాలుగు చుక్కల పాలు లేదా ఆల్కహాల్‌ వేసి మృదువుగా రాయాలి. దుప్పట్లు, తలగడ కవర్లపై  చేతులకు రాసే శానిటైజర్‌ను రెండుమూడు చుక్కలు వేసి రుద్ది, ఆ తర్వాత ఉతికితే చాలు. పిల్లల ముఖాలు, చేతులపై ఈ మరకలుంటే నీటిలో నానబెట్టిన టీబ్యాగును రుద్దితే క్రమేపీ మరక మాయమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్