ఫొటోలతో అలంకరించేయండి!
ఇంటి అలంకరణలో ఎంతో ఆలోచిస్తుంటాం. బోలెడు ఖర్చూ పెడుతుంటాం. మీ ఫొటోలనీ అలంకరణగా మార్చొచ్చని తెలుసా? ఎలాగో చూసేయండి.
ఇంటి అలంకరణలో ఎంతో ఆలోచిస్తుంటాం. బోలెడు ఖర్చూ పెడుతుంటాం. మీ ఫొటోలనీ అలంకరణగా మార్చొచ్చని తెలుసా? ఎలాగో చూసేయండి.
* వరుసలో.. కొన్ని పాకెట్ సైజ్ ఫొటోలను ఎంచుకోండి. ఒక పొడవాటి తాడు/ వైర్‌ను తీసుకొని ఫొటో క్లిప్‌లతో దానికి జోడించేయండి. మీ ఫొటోలే ఉండాలనేం లేదు. ఏదైనా ట్రిప్వీ, మీరు సరదాగా తీసినవి.. ఇలా వేటినైనా పెట్టుకోవచ్చు. చిన్న గోడలు, బుక్ షెల్ఫ్లున్న చోట ఈ అమరిక బాగుంటుంది.
* గ్రిడ్.. తీగలను చతురస్రాకారం వచ్చేలా అమర్చాలి. వాటిని తిరిగి చిన్న చిన్న చతురస్రాలుగా వచ్చేలా చూసుకోవాలి. ఒకదాన్ని విడిచి మరోదానిలో ఫొటోలు పెడితే సరిపోతుంది.
* ఒకదాని కింద మరోటి.. కొంచెం వదులుగా ఒకదాని కింద మరొకటి అడ్డంగా కొన్ని వైర్లు/ తాళ్లను అతికించాలి. తర్వాత వాటికి నచ్చిన ఫొటోలను జోడిస్తే సరి! వాటి కింద చిన్న టేబుల్ ఉంచి, ఇరువైపులా చిన్న మొక్కలుంచి చూడండి.. చాలా బాగుంటుంది.
* పచ్చదనం కావాలా?.. మొక్కలు అలంకరణలో తప్పనిసరి అయ్యాయి. మీ ఇంటి థీమ్లోనూ ఇదే పంథా అయితే పచ్చదనాన్ని చేర్చేయండి. సమాన పరిమాణంలో ఉన్న చెక్కలను ఒకదాని కింద ఒకటి, పక్కలా అమర్చేయండి. ఇండోర్ మొక్కలు చిన్న వాటిని అక్కడక్కడా అమర్చి వాటి మధ్యలో ఫొటోలుంచితే సరిపోతుంది. లేదూ.. ఒక కర్రముక్కను తీసుకుని దానికి కృత్రిమ ఆకుల తీగలను అతికించాలి. అక్కడక్కడా ఫొటోలు అతికిస్తే సరి.
* ఫ్రేమ్‌లో.. ఉపయోగించని ఫ్రేమ్‌లు, రింగులు ఉన్నాయా? మొత్తం రంగురంగుల కాగితాలను చుట్టేయండి. మధ్యలో తెల్లని రిబ్బన్‌తో కట్టేసి, పైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలుంచాలి. ఫ్రేమ్‌కి మూలన కృత్రిమ పూలు, ఆకులు ఉంచి, గోడకు తగిలించేయండి. ప్రత్యేక అందం వచ్చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!