ఇల్లు సర్దడం కష్టంగా ఉందా...

పాత తరంతో పోలిస్తే మనందరికీ ఒత్తిడీ ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఓపిక సన్నగిల్లుతోంది. ఈ అలసట వల్ల ఒక్కోసారి ఇల్లు సర్దుకోవడం, అందంగా తీర్చిదిద్దుకోవడం భారమైన వ్యవహారంగా తోస్తోందా? అయితే ఈ చిన్న చిన్న సూచనలు మీ కోసమే...

Published : 06 Jun 2022 01:24 IST

పాత తరంతో పోలిస్తే మనందరికీ ఒత్తిడీ ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఓపిక సన్నగిల్లుతోంది. ఈ అలసట వల్ల ఒక్కోసారి ఇల్లు సర్దుకోవడం, అందంగా తీర్చిదిద్దుకోవడం భారమైన వ్యవహారంగా తోస్తోందా? అయితే ఈ చిన్న చిన్న సూచనలు మీ కోసమే...

* ఇల్లు చిందరవందర కాకూడదంటే ఇంట్లో అందరూ పాటించాల్సిన మొదటి జాగ్రత్త.. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టడం. ఈ సూత్రాన్ని నిర్లక్ష్యం చేశామో ప్రతి రోజు అరల్లోని వస్తువులు బల్లలు, టీపాయ్‌పై చేరి గందరగోళమవుతుంది. 

* చాలామంది అమ్మమ్మల నాటి కంచు, ఇత్తడి సామాను, గ్రాంఫోన్‌ లాంటి వస్తువులు నిరుపయోగంగా ఉన్నాయని పాత సామాన్ల వాళ్లకు అమ్మేస్తారు లేదా అటక మీదికెక్కిస్తారు. వీటిని ముందు వసారాలో అమర్చితే తృప్తిగా ఉండటమే కాదు, ఇంటికి శోభ వస్తుంది. పురాతన వస్తువుల విలువ తెలిసిన వాళ్లనుంచి ప్రశంసలూ వస్తాయి. 

* కప్‌బోర్డుల్లో అరలు ఎత్తుగా ఉంటే ఎక్కువ వస్తువులు పట్టవు. తక్కువ ఎత్తు ఉండేట్లు చేయంచుకుంటే సరి. ఒకవేళ ఉన్నవాటిని మార్చే అవకాశం లేకుంటే లోపల షెల్ఫ్‌ రైజర్లు పెట్టించడం వల్ల ఎక్కువ సామాన్లు అరల్లో సర్దేయొచ్చు.

* కందిపప్పు, పెసరపప్పు, ఉప్మారవ్వ లాంటివి ఏ డబ్బాల్లో పెట్టామో గుర్తులేక ఏది అవసరమైనా అన్నీ మూతలు తీసి వెతుకుతుంటాం. ఈ కష్టం లేకుండా కొందరు గాజు సీసాలు ఉపయోగిస్తున్నారు. హడావుడిలో చెయ్యి జారితే పగిలిపోతాయి. ప్రత్యామ్నాయంగా పల్చటి ప్లాస్టిక్‌ డబ్బాలు వాడితే, లోపల పదార్థాలు కనిపిస్తూ వెతకాల్సిన శ్రమ ఉండదు. స్టీలు డబ్బాలు వినియోగించాలంటే మార్కర్‌తో రాసుకోవచ్చు. లేదా స్టిక్కర్లూ వేయొచ్చు.

* వంటింట్లో చిన్నచిన్న వస్తువులను క్లోజెట్‌ ఆర్గనైజర్లలో అమర్చుకుంటే అవసరమైనప్పుడు తేలిగ్గా తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్