ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా?

కొద్దిపాటి స్థలంలో పెంచే వీలు, తక్కువ నిర్వహణ కోసం చూసే వారు ఇండోర్‌ ప్లాంట్లకు ఓటు వేస్తారు. ఇంటి అలంకరణ కోసం పెంచేవారు మెచ్చేదీ వీటినే! పైగా గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి. మరి వాటిని పెంచడంలో జాగ్రత్తలు తీసుకోవాలిగా! ఆ చిట్కాలే ఇవి..

Published : 12 Jun 2022 00:20 IST

కొద్దిపాటి స్థలంలో పెంచే వీలు, తక్కువ నిర్వహణ కోసం చూసే వారు ఇండోర్‌ ప్లాంట్లకు ఓటు వేస్తారు. ఇంటి అలంకరణ కోసం పెంచేవారు మెచ్చేదీ వీటినే! పైగా గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి. మరి వాటిని పెంచడంలో జాగ్రత్తలు తీసుకోవాలిగా! ఆ చిట్కాలే ఇవి..

నీరు అన్నింటికీ ఒకేలా సరిపోవు. ఎడారి జాతుల మొక్కలకు మట్టి తడిసేలా నీరిస్తే సరిపోతుంది. గుబురుగా, మందమైన ఆకులతో ఉన్నవాటికి ఎక్కువ నీరు కావాలి. మిగతా వాటికి కొద్ది మొత్తంలో పోస్తే సరిపోతుంది. ఎప్పుడు పోయాలో తెలియకపోతే మట్టిలో వేలునుంచండి. తడి తగిలితే సరే! లేదంటే కాసిని పోస్తే సరి. ఆకులు రంగు మారడం, రాలిపోవడం, నెమ్మదిగా ఎదగడం, అంచులు ఎండిపోవడం వంటివన్నీ నీరు సరిగా అందట్లేదనడానికి చిహ్నాలే.

* ఇంట్లో పెంచేవే అయినా.. వాటికీ వెలుతురు కావాలి. కాబట్టి, అప్పుడప్పుడూ ఉదయపు ఎండలో వాటిని కొంతసేపు ఉంచాలి. కొన్ని నేరుగా పడే ఎండను తట్టుకోలేవు. అలాంటప్పుడు పలుచటి వస్త్రాన్ని ఎండకు వేసి, దాని నీడలో ఉంచితే సరిపోతుంది.
* కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతుంటాం కదా! ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు. మొక్కల పరిస్థితీ అంతేనట! కొత్తగా తెచ్చినప్పుడు కొద్ది సమయం తీసుకుని ఆ వాతావరణానికి అలవాటు పడతాయి. అందం కోసమనో, మరేదో కారణంగానో పదే పదే వాటి స్థలాన్ని మార్చకండి. అవీ ఇబ్బంది పడతాయి. ఒక్కసారిగా చీకటి/ వెలుతురులోకీ తీసుకెళ్లొద్దు.
* మొక్క పెరిగేకొద్దీ పెద్ద కుండీల్లోకి మార్చడం మామూలే. అయితే కేవలం మొక్కనే పట్టుకొని తీయొద్దు. దానిలోని మట్టితో సహా మార్చండి. లేదంటే అది చనిపోయే ప్రమాదముంది. అలాగే మార్చబోయే కుండీలో నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం లేయర్లుగా వేయండి. తర్వాతే మొక్కను మార్చండి.
* మొక్కలకు వాడిన టీ, కాఫీ పొడులను ఎరువుగా వేస్తుంటాం కదా! ఇండోర్‌ మొక్కలకు మాత్రం వేయకండి. కీటకాలను ఆకర్షించే ప్రమాదమెక్కువ. అలాగే ఎప్పటికప్పుడు ఎండిన ఆకులు, కొమ్మలనూ తొలగించడమూ మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్