వృథాతో... కుండీలు!

దిల్లీలోని గాలి కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ దానిని సమస్యగా భావిస్తే సాయేషా, ఎవాన్షికా శిరోహిలు మాత్రం దాన్నే చక్కని వ్యాపార సూత్రంగా భావించారు. మూడేళ్ల క్రితం దిల్లీలోని ప్రవాహ్‌ స్వచ్ఛంద సంస్థ, ఎనాక్టస్‌ అనే మరో సంస్థతో కలిసి

Published : 17 Jun 2022 00:59 IST

దిల్లీలోని గాలి కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ దానిని సమస్యగా భావిస్తే సాయేషా, ఎవాన్షికా శిరోహిలు మాత్రం దాన్నే చక్కని వ్యాపార సూత్రంగా భావించారు. మూడేళ్ల క్రితం దిల్లీలోని ప్రవాహ్‌ స్వచ్ఛంద సంస్థ, ఎనాక్టస్‌ అనే మరో సంస్థతో కలిసి ఇంటి కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని ఆవిష్కరణల చేశాయి. ఈ ప్రాజెక్టులో షహీద్‌ సుఖదేవ్‌  బిజినెస్‌ స్కూల్‌కి చెందిన విద్యార్థినులు సాయేషా, శిరోహీలు కూడా పాల్గొన్నారు. ‘ఇంటి కాలుష్యాన్ని నివారించాలంటే... ముందు బయట కాలుష్యాన్ని అదుపు చేయాలి. అంటే గాలి కాలుష్యానికి కారణమవుతున్న వ్యవసాయ వృథాని వినియోగంలోకి తీసుకురావాలి. అప్పుడే మాకు స్టబుల్‌ పాట్స్‌ ఆలోచన వచ్చింది. మామూలు పద్ధతుల్లో వృథాని ఎరువుగా మార్చడానికి చాలా సమయం పడుతుంది. బదులుగా వృథానే కుండీగా మారిస్తే మొక్కలు నిదానంగా పంటల వ్యర్థాలనుంచి పోషకాలని గ్రహిస్తాయి. మేం చేసిన కుండీల్లో పెంచిన మొక్కలు వేగంగా ఫలవంతం అవుతున్నాయి. మామూలు కుండీల కంటే ఎక్కువ ఫలాల్ని, ఉత్పత్తినీ ఇస్తున్నాయి. అమెజాన్‌లో అమ్మకానికి ఉంచాం. మరోవైపు  రైతులకీ ఈ విషయంలో అవగాహన కల్పిస్తున్నాం’ అంటున్నారు సాయేషా, శిరోహి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్